Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: కొత్త కొత్తగా కనిపిస్తున్న 24

By:  Tupaki Desk   |   24 Nov 2015 6:48 AM GMT
ఫస్ట్ లుక్: కొత్త కొత్తగా కనిపిస్తున్న 24
X
24.. సూర్య - సమంత జంటగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సూర్య గెటప్ ని రెండు విభిన్నమైన షేడ్స్ తో ఇచ్చిన పోస్టర్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఒకదాంట్లో గెటప్ తో నావల్టీ చూపించిన సూర్య, మరో పోస్టర్ లో కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తున్నాడు. రెండు పోస్టర్స్ ఎలక్ట్రిఫైయింగ్ గా డిజైన్ చేశారు. ఆన్ లైన్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కాసేపటికే.. లక్షల కొద్దీ క్లిక్స్ వచ్చేస్తున్నాయి.

మొత్తాన్ని 24 అనే టైటిల్ మాత్రమే కాదు.. మూవీ కూడా చాలా విభిన్నంగా ఉండనుందని, ఫస్ట్ లుక్ తోనే అర్ధమైపోయింది. కోలీవుడ్ లో ఈ చిత్రాన్ని సుదీర్ఘమైన ప్రాజెక్ట్ అనాలి. ఎందుకంటే.. ఏడేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అప్పట్లో చియాన్‌ విక్రం హీరోగా, ఇలియానా హీరోయిన్ గా పిక్చర్ ని స్టార్ట్ చేసినా.. తర్వాత నిలిపేయాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అందించడంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ విఫలం కావడంతో.. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు మెయిన్ థీమ్ అదే తీసుకుని.. కేరక్టర్లు - సన్నివేశాలను సంపూర్తిగా మార్చేసి, సినిమా షూటింగ్ ప్రారంభించారు. విక్రం రిజెక్ట్ చేసిన స్టోరీని సూర్య ఒప్పుకోవడంపై కొన్ని విమర్శలు వచ్చినా.. ప్రాజెక్ట్ పై సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

వివిధ రకాల టైం జోనర్ లలో ప్రయాణించే కాన్సెప్ట్ అని అనుకుంటున్నా.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏం లేదు. ఈ ఏడాది మే నెలలో 24 మూవీ షూటింగ్ ప్రారంభించినపుడు... పొంగల్ నాటికి సిద్ధం చేయాలని భావించారు. అయితే... ప్రస్తుతం ఉన్న ప్రోగ్రెస్ ప్రకారం.. హడావిడి పడకుండా 2016 సమ్మర్ కి రిలీజ్ సెట్ చేసుకుంది యూనిట్. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండడం విశేషం.