Begin typing your search above and press return to search.

వారినే మించేలా అతి చేస్తున్న సూర్య ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   20 May 2019 6:42 AM GMT
వారినే మించేలా అతి చేస్తున్న సూర్య ఫ్యాన్స్‌
X
మన వద్ద స్టార్‌ హీరోలకు ఫ్యాన్స్‌ విపరీతంగా ఉంటారు. అయితే కొందరు ఫ్యాన్స్‌ తప్ప ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ పద్దతిగా ఉంటారు. కాని తమిళ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మాత్రం మరీ అతి చేస్తూ ఉంటారు. స్టార్‌ హీరో అజిత్‌, రజినీకాంత్‌, విజయ్‌ ల ఫ్యాన్స్‌ మద్య ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. కలెక్షన్స్‌ విషయంలో, రికార్డుల విషయంలో ఇంకా పలు విషయాల్లో హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇంకా బాహా బాహీగా ఫైట్‌ చేసుకుంటూనే ఉంటారు. తాజాగా వారితో సూర్య ఫ్యాన్స్‌ కూడా చేరబోతున్నట్లుగా అనిపిస్తుంది.

విజయ్‌, అజిత్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోలకు పెద్ద ఎత్తున ప్లెక్సీలు కట్టడం, హోర్డింగ్‌ లు పెట్టడం చేస్తూ ఉంటారు. అజిత్‌ ఫ్యాన్స్‌ 100 అడుగుల కటౌట్‌ పెడితే విజయ్‌ ఫ్యాన్స్‌ 150 అడుగుల కటౌట్‌ కు ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి సమయంలో సూర్య ఫ్యాన్స్‌ కూడా భారీ కటౌట్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 215 అడుగులతో కటౌట్‌ ను పెట్టబోతున్నారు.

ఇండియాలో ఏ హీరోకు కూడా ఈ స్థాయిలో కటౌట్‌ పెట్టింది లేదు. సూర్య నటిస్తున్న 'ఎన్జీకే' చిత్రం విడుదల సందర్బంగా 215 అడుగుల కటౌట్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 31న విడుదల కాబోతున్న ఎన్జీకే చిత్రంపై సూర్య అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగా ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్‌ ఈ చిత్రంను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అభిమానులు చాలా ఉత్సాహంగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

ఎన్జీకే చిత్రం సూర్య కెరీర్‌ లో నిలిచి పోవాలనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్‌ 215 అడుగుల కటౌట్‌ ను సైతం ఏర్పాటు చేయిస్తున్నారు. విజయ్‌ మరియు అజిత్‌ ఫ్యాన్స్‌ ను సూర్య ఫ్యాన్స్‌ డామినేట్‌ చేసేందుకు ఇలా అతి చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి తమిళ స్టార్స్‌ ఫ్యాన్స్‌ వార్‌ లోకి సూర్య ఫ్యాన్స్‌ కూడా చేరడం అక్కడ పరిస్థితి మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మన వద్ద స్టార్‌ హీరోలకు ఫ్యాన్స్‌ విపరీతంగా ఉంటారు. అయితే కొందరు ఫ్యాన్స్‌ తప్ప ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ పద్దతిగా ఉంటారు. కాని తమిళ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మాత్రం మరీ అతి చేస్తూ ఉంటారు. స్టార్‌ హీరో అజిత్‌, రజినీకాంత్‌, విజయ్‌ ల ఫ్యాన్స్‌ మద్య ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. కలెక్షన్స్‌ విషయంలో, రికార్డుల విషయంలో ఇంకా పలు విషయాల్లో హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇంకా బాహా బాహీగా ఫైట్‌ చేసుకుంటూనే ఉంటారు. తాజాగా వారితో సూర్య ఫ్యాన్స్‌ కూడా చేరబోతున్నట్లుగా అనిపిస్తుంది.

విజయ్‌, అజిత్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోలకు పెద్ద ఎత్తున ప్లెక్సీలు కట్టడం, హోర్డింగ్‌ లు పెట్టడం చేస్తూ ఉంటారు. అజిత్‌ ఫ్యాన్స్‌ 100 అడుగుల కటౌట్‌ పెడితే విజయ్‌ ఫ్యాన్స్‌ 150 అడుగుల కటౌట్‌ కు ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి సమయంలో సూర్య ఫ్యాన్స్‌ కూడా భారీ కటౌట్‌ కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 215 అడుగులతో కటౌట్‌ ను పెట్టబోతున్నారు.

ఇండియాలో ఏ హీరోకు కూడా ఈ స్థాయిలో కటౌట్‌ పెట్టింది లేదు. సూర్య నటిస్తున్న 'ఎన్జీకే' చిత్రం విడుదల సందర్బంగా 215 అడుగుల కటౌట్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 31న విడుదల కాబోతున్న ఎన్జీకే చిత్రంపై సూర్య అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగా ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్‌ ఈ చిత్రంను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అభిమానులు చాలా ఉత్సాహంగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

ఎన్జీకే చిత్రం సూర్య కెరీర్‌ లో నిలిచి పోవాలనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్‌ 215 అడుగుల కటౌట్‌ ను సైతం ఏర్పాటు చేయిస్తున్నారు. విజయ్‌ మరియు అజిత్‌ ఫ్యాన్స్‌ ను సూర్య ఫ్యాన్స్‌ డామినేట్‌ చేసేందుకు ఇలా అతి చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి తమిళ స్టార్స్‌ ఫ్యాన్స్‌ వార్‌ లోకి సూర్య ఫ్యాన్స్‌ కూడా చేరడం అక్కడ పరిస్థితి మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.