మహేష్ భామకు అలా కలిసొస్తోంది

Thu Jun 14 2018 09:54:37 GMT+0530 (IST)

అందమైన మోముతో.. ఆకట్టుకునే నవ్వుతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే లవ్ లో పడేసే అమ్మాయి పాత్రతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సోగకళ్ల సుందరి కియారా అద్వానీ. భరత్ అనే నేను మూవీలో మహేష్ బాబు పక్కన సీఎం గర్ల్ ఫ్రెండ్ పాత్రలో బాగానే మెప్పించింది. బాలీవుడ్ లో ఎం.ఎస్.ధోని సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఈమధ్య తనకు లక్కు తెగ కలిసొచ్చేస్తోందని అంటోంది.కియారా అద్వానీ ఈ ఏడాది ఇంకా రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. బాలీవుడ్ లోని నలుగురు పెద్ద డైరెక్టర్లు కలిసి దర్శకత్వం చేస్తున్న డిజిటల్ సిరీస్ లస్ట్ స్టోరీస్ లో కియారా ఓ పాత్ర చేస్తోంది. మధ్యతరగతి మహిళల సెక్సువల్ లైఫ్ లోని డార్క్ యాంగిల్ ను చూపించేలా ఈ కామ కథలు ఉంటాయి. ఇందులో కియారా నటిస్తున్న కథను కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతోపాటు అభిషేక్ వర్మ డైరెక్షన్ లో కరణ్ జోహార్ - సాజిద్ నడియావాలా సంయుక్తంగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్న కళంక్ సినిమాలోనూ కియారా నటిస్తోంది.

కళంక్ సినిమాలో మాధురి దీక్షిత్ - సోనాక్షి సిన్హా - ఆలియా భట్ - వరుణ్ ధావన్ - సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇంతమంది పేరొందిన నటులతో కలిసి నటించే అవకాశం రావడంతో కియారా ఉబ్బితబ్బిబ్బవుతోంది. 2014లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ 2018లో తన దశ తిరిగిందని ఆనందపడిపోతోంది. ప్లాన్ చేయకపోయినా అన్నీ కలిసొస్తున్నాయని ఉబ్బితబ్బిబ్బవుతోంది.