Begin typing your search above and press return to search.

వచ్చే ఏడాది సీక్వెల్ నామ సంవత్సరమే

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:30 PM GMT
వచ్చే ఏడాది సీక్వెల్ నామ సంవత్సరమే
X
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్ డల్ గా ఉందనే చెప్పాలి. తెలుగులో ఇప్పటివరకూ 150కిపైగా మూవీస్ రిలీజ్ అయినా... అందులో మంచి హిట్స్ సాధించిన చిత్రాలు సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. నిర్మాతలకు లాభాలు పంచిన మూవీస్ తక్కువగా ఉండడం.. టాలీవుడ్ ని ఇబ్బంది పెడుతున్న సమస్య. కొందరు స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గానే నిలబడి.. అంచనాలను అందుకోలేకపోయాయి.

ఈ సమస్యను టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా ఎదుర్కుంటోంది. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీకి కూడా పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. దీంతో వచ్చే ఏడాది కోసం దాదాపు బడా స్టార్స్ అందరూ సీక్వెల్స్ పై దృష్టి పెట్టారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ రజినీకాంత్ గురించే. శంకర్ డైరెక్షన్ లో రోబో2 వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్ కూడా విశ్వరూపం2 ను సిద్ధం చేసేస్తున్నారు. దీనితోపాటు తన పాత సూపర్ హిట్స్ ను కొన్నింటింకి సీక్వెల్స్ తీయబోతున్నారని, నెపోలియన్ చేసిన ఓ మూవీ కూడా ఈ లిస్ట్ లో ఉందని కోలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇక దిగ్గజ దర్శకుడు మణిరత్నం అయితే.. అగ్ని నక్షత్రానికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే వరుస సీక్వెల్స్ తో సత్తా చాటిన లారెన్స్... మరిన్ని చిత్రాలను ఇదే కోవలోకి చేర్చుతున్నాడు. మన్మధ మూవీకి సీక్వెల్ తీయబోతున్నాడు శింబు.

ఒరిజినల్ తో పోల్చితే.. ప్రమోషన్ విషయంలో సీక్వెల్ కి అడ్వాంటేజ్ ఉండడం, అప్పటికే సూపర్ హిట్ అయిన మూవీస్ కావడంతో.. ఆటోమేటిగ్గా హైప్ వస్తుండడంతో.. వీటికే మొగ్గు చూపుతున్నారు మేకర్స్. ఇవన్నీ పట్టాలెక్కితే మాత్రం.. వచ్చే ఏడాది కోలీవుడ్ కి సీక్వెల్ నామ సంవత్సరం అయిపోతుంది