Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండమైన రేటు

By:  Tupaki Desk   |   28 Nov 2015 4:19 PM GMT
బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండమైన రేటు
X
టాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ హీరో మహేష్ బాబు. సినిమా సినిమాకి రిజల్ట్ తో సంబంధం లేకుండా దూసుకుపోయే సత్తా ఉన్నవాడే సూపర్ స్టార్. ప్రతీ మూవీకి తన రెమ్యూనరేషన్ ని, స్థాయినే కాదు.. మూవీ రేంజ్ కూడా మార్చేస్తున్నాడు మహేష్. కేవలం రెమ్యూనరేన్ వరకే కాకుండా.. సినిమా కలెక్షన్స్ విషయంలో సత్తా చాటుతున్న దిట్ట మహేష్. ఇప్పుడు మహేష్ క్రేజ్ ఎంతటి రేజ్ ఉందో ప్రూవ్ చేసేందుకు... ప్రిన్స్ నెక్ట్స్ మూవీ శాటిలైట్ రైట్స్ కి ఉన్న డిమాండ్ చూస్తే అర్దమవుతుంది.

ప్రస్తుతం ఈ బ్రహ్మోత్సవం కోసం 20 కోట్లు ఇచ్చేందుకు ఛానల్స్ ముందుకొచ్చాయట. అయితే డీల్ ఇంకా ఫైనల్ అయిందో లేదో మాత్రం తెలియలేదు. బాహుబలి తర్వాత ఏ మూవీకైనా ఇదే అతి పెద్ద మొత్తం. శ్రీమంతుడు తర్వాత మహేష్ రేంజ్ మరింతగా పెరిగిపోయిందనడంలో ఏమాత్రం అక్కర్లేదు. దీనికితోడు ప్యామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ కి సూపర్బ్ క్రేజ్ ఉంది. మరోవైపు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీసిన శ్రీకాంత్ అడ్డాల.. బ్రహ్మోత్సవానికి డైరెక్టర్ కావడంతో.. ఇది మరో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనే నమ్మకం అందరికీ ఏర్పడింది. ఈ దెబ్బకి శాటిలైట్ రైట్స్ కోసం డిమాండ్ పెరిగిపోయింది. ఇదే కాక.. మహేష్ సినిమాలకు టీవీల్లో బ్రహ్మాండమైన వ్యూయర్ షిప్ ఉంటుంది.

అతడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో చిత్రాలను... ఎప్పుడు ప్రదర్శించినా రికార్డ్ టీఆర్పీ వస్తోంది. రీసెంట్ గా ప్రదర్శించిన శ్రీమంతుడుకు కూడా 21.4 టీఆర్పీ వచ్చింది. ఇలా ఇన్ని పాజిటివ్ పాయింట్స్ బ్రహ్మోత్సవం చుట్టూ ఉండండతో.. ఎలాగైనా రైట్స్ దక్కించుకోవాలని ఛానల్స్ పోటీ పడుతున్నాయి. మహేష్ సినిమాలపై ఎంత పెట్టుబడి పెట్టినా.. తిరిగొచ్చేయడం తేలిక కావడంతోనే ఇంతగా రేటు పలుకుతోందంటున్నారు టాలీవుడ్ జనాలు.