నైజాంలో ‘2.ఓ’ పెద్ద టార్గెట్ పై కన్ను

Sun Dec 09 2018 21:00:01 GMT+0530 (IST)

రజినీకాంత్ శంకర్ ల కాంబో కు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గత చిత్రాలు భారీ వసూళ్లను దక్కించుకున్నాయి. తాజా గా 2.ఓ చిత్రం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లు దక్కించుకుంటుంది. భారీ రేటుకు తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన నిర్మాతలు పెట్టుబడినైనా దక్కించుకుంటారా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ఫలితం చూస్తుంటే లాభాలు కూడా వచ్చే అవకాశం ఉందనిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ ఉంది.విడుదలైనప్పటి నుండి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు వరుసగా సెలవులు వచ్చిన కారణంగా సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. సంక్రాంతి వరకు సినిమా మంచి వసూళ్లను రాబడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కేవలం నైజాం ఏరియాలోనే లాంగ్ రన్ లో 2.ఓ చిత్రం ఏకంగా 30 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నైజాంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.

అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టడం అనేది అసాధ్యం అని తేలిపోయింది. పలు చోట్ల బాహుబలి 1 రికార్డును అయితే క్రాస్ చేయగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ వరకు 2.ఓ మూవీ సందడి కొనసాగడం ఖాయం.