Begin typing your search above and press return to search.

2.0 బ్రేక్ ఈవెన్.. ఆ ఒక్కచోటే

By:  Tupaki Desk   |   6 Dec 2018 10:55 AM GMT
2.0 బ్రేక్ ఈవెన్.. ఆ ఒక్కచోటే
X
‘2.0’ బయ్యర్ల లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సినిమా చివరి కి ఎంతకు ముంచుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సినిమా పై అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టారు. విడుదల ముంగిట ఈ సినిమా పై ఊహించని రీతిలో నెగిటివిటీ మొదలైంది. కానీ అంతకు చాన్నాళ్ల ముందే అమ్మకాలు పూర్తయిపోయాయి. ‘2.0’పై అప్పటికి ఉన్న అంచనాల దృష్ట్యా బయ్యర్లు భారీ మొత్తాలకు హక్కులు తీసుకున్నారు.

కానీ రిలీజ్ ముంగిట కథ మారిపోయింది. సినిమా ఫలితం పై సందేహాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే డివైడ్ టాక్ తెచ్చుకుందీ చిత్రం. మామూలుగా చూస్తే ఓకే కానీ.. ‘రోబో’కు సీక్వెల్.. శంకర్-రజనీ కాంబినేషన్లో వచ్చిన సినిమా.. అందునా భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం కావడంతో దీని నుంచి ఎంతో ఆశించారు జనాలు. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకపోవడంతో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే వసూళ్లు కూడా ఉన్నాయి.

మామూలుగా చూస్తే ‘2.0’ భారీ వసూళ్లే సాధించింది. కానీ దీని పై ఉన్న అంచనాలు, పెట్టుబడుల దృష్ట్యా ఆ వసూళ్లు తక్కువనే చెప్పాలి. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం ఒక్క హిందీలో తప్ప ఇంకెక్కడా బ్రేక్ ఈవెన్ కు వచ్చేలా కనిపించడం లేదు. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ వీక్ డేస్ లో సైతం సత్తా చాటుతోంది. సోమ.. మంగళవారాల్లో కలిపి ఈ చిత్రం హిందీలో రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. మొత్తంగా హిందీ వెర్షన్ వసూళ్లు రూ.123 కోట్లకు చేరుకున్నాయి. అక్కడ త్వరలోనే ‘2.0’ బ్రేక్ ఈవెన్ కు రానుంది. కానీ తెలుగు. తమిళంలో మాత్రం భారీ నష్టాలు తప్పేట్లు లేవు.

తెలుగు వెర్షన్ హక్కులు రూ.72 కోట్లకు కొంటే ఇప్పటిదాకా వచ్చిన షేర్ రూ.40 కోట్లకు అటు ఇటుగా ఉంది. రానున్న రోజుల్లో రూ.30 కోట్ల దాకా షేర్ రావడం అసాధ్యం. ఇక తమిళ వెర్షన్ అయితే పెట్టుబడిలో 60 శాతం వెనక్కి తెచ్చినా గొప్పే అంటున్నారు. తమిళనాట ఈ చిత్రం మొదట్నుంచి అండర్ పెర్ఫామ్ చేస్తోంది. రూ.100 కోట్లకు తమిళనాడు హక్కులు అమ్ముడైతే ఇప్పటిదాకా 40 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు


తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం -16.96 cr
సీడెడ్ - 6.28 cr
ఉత్తరాంధ్ర - 5.03 cr
ఈస్ట్ - 2.91 cr
వెస్ట్ - 2.05 cr
కృష్ణ - 2.32 cr
గుంటూరు - 2.91 cr
నెల్లూరు - 1.59 cr

ఏపీ + తెలంగాణా టోటల్: రూ.40.05 కోట్లు షేర్