2.0 చెన్నై బాక్సాఫీస్ 20కోట్లు

Thu Dec 13 2018 21:57:46 GMT+0530 (IST)

2.ఓ సంచలనాల గురించి ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాకి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చినా అన్నిటినీ అధిగమించి ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం లాంగ్ రన్ లో బెటర్ రిజల్టును అందుకుంటోంది. ముఖ్యంగా సౌత్ ని మించి నార్త్ లో రికార్డులు బ్రేక్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద 100కోట్లు - దక్షిణాది నుంచి 100 కోట్లు పైబడి వసూలు చేసింది. ఓవర్సీస్ నుంచి 60కోట్లు వసూలైంది. మరో 25 శాతం వసూళ్లు సౌత్‌లో తెస్తే సేఫ్ అయినట్టేనన్న మాటా వినిపిస్తోంది.అదంతా అటుంచితే తమిళనాడు రాజధాని చెన్నయ్‌లో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తూ 2.ఓ చిత్రం ఏకంగా 20కోట్ల గ్రాస్ వసూలు చేయడం సంచలనమైంది. ఇప్పటివరకూ చెన్నయ్ బాక్సాఫీస్ వద్ద కబాలి 24కోట్ల తో నంబర్ -1 స్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2 చిత్రం 18 కోట్ల తో నంబర్ 2గా ఉండేది. ఇక నంబర్ 2 స్థానానికి 2.ఓ చేరుకుంది. అది కూడా కేవలం 12రోజుల్లోనే ఈ ఫీట్ వేయగలిగిన సినిమాగా రికార్డుల కెక్కింది. 2.ఓ చిత్రం కబాలి  చెన్నయ్ రికార్డుల్ని బ్రేక్ చేసే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. ఇక అజిత్ నటించిన వివేగం- 14 కోట్ల తో నాలుగో స్థానంలో ఉంటే - విక్రమ్ వేద-11 కోట్లతో - స్పైడర్ -9 కోట్ల తో చెన్నయ్ బాక్సాఫీస్ వద్ద టాప్ 10లో నిలిచాయి.

ఓవైపు 2.ఓ బాక్సాఫీస్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలోనే అప్పుడే లైకా సంస్థ 3.ఓ గురించిన ఆలోచన చేస్తోందన్న సమాచారం అందుతోంది. లైకా ప్రతినిధుల్లో ఈ ఆలోచన ఉంది. అయితే ప్రస్తుతం శంకర్ `భారతీయుడు 2` బిజీలో ఉన్నారు కాబట్టి అది పూర్తయి రిలీజయ్యేందుకే చాలా సమయం పడుతుంది. ఈలోగానే 3.ఓ స్క్రిప్టు గురించి చర్చ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.