అల్లు హీరో ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు!!

Mon Mar 20 2017 16:20:29 GMT+0530 (IST)

శ్రీరస్తు శుభమస్తు అంటూ గతేడాది తొలిసారిగా హిట్ అందుకున్నాడు అల్లు శిరీష్. అదే జోష్ ను కంటిన్యూ చేసేస్తూ మలయాళ పరిశ్రమలో పాదం మోపేస్తున్నాడు. 1971 బెయాండ్ ద బోర్డర్స్ అనే టైటిల్ పై రూపొందిన చిత్రంలో శిరీష్ నటించగా.. ఏప్రిల్ 7న ఈ మూవీ విడుదల కానుంది.

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా.. ఓ వార్ ట్యాంకర్ ఆపరేటర్ గా కనిపించనున్నాడు అల్లు శిరీష్. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది యూనిట్. యుద్ధ ప్రాంతంలో పరుగెత్తుతున్న అల్లు శిరీష్ మనకు ఈ పోస్టర్ లో కనిపిస్తాడు. తెలుగులో  ఈచిత్రానికి 1971 భారత సరిహద్దు అనే టైటిల్ ఫైనల్ చేయగా.. ఈ వెర్షన్ ను కూడా ఏప్రిల్ 7నే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఆ రోజుకి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. తెలుగు వెర్షన్ ను ఆలస్యంగా విడుదల చేయచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.

జనతా గ్యారేజ్ సక్సెస్ లో భాగం అందుకున్న మోహన్ లాల్.. రీసెంట్ గా  మన్యంపులితో సోలోగా కూడా హిట్ కొట్టారు. తెలుగులో మార్కెట్ పెంచుకున్నారు. ఇప్పుడు 1971 భారత సరిహద్దు అంటూ మెగా ఫ్యామిలీ హీరోతో కలిసి వస్తుండడంతో..  ఈ సినిమాపై ట్రేడ్ తో పాటు జనాల్లో కూడా మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/