టీజర్ టాక్ః యుద్ధం.. యుద్ధం.. యుద్ధం

Mon Mar 20 2017 18:19:53 GMT+0530 (IST)

మలయాళంలో తొలిసారి అల్లు శిరీష్ నటించిన ‘1971 భారత సరిహద్దు’ ఫస్ట్ టీజర్ వచ్చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ చిత్ర టీజర్ ను సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. ‘1971 భారత సరిహద్దు’ అనే టైటిల్.. దీని ఫస్ట్ పోస్టర్ చూసి టీజర్ ఎలా ఉండొచ్చని అనుకున్నారో అలాగే ఉంది. ఇది పూర్తిగా యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రం.

టీజర్ అంతటా కూడా యుద్ధ సన్నివేశాలే చూపించారు. ఇందుకోసం చాలానే కష్టపడ్డట్లుంది చిత్ర బృందం. మోహన్ లాల్ ఇందులో మేజర్ సహదేవన్ పాత్ర పోషిస్తుంటే.. దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడే సైనికుడి పాత్రలో అల్లు శిరీష్ కనిపిస్తున్నాడు. టీజర్లో అతను ఈ డైలాగే చెప్పాడు. టీజర్ వరకు చూస్తే శిరీష్ అంత ప్రత్యేకంగా ఏమీ కనిపించట్లేదు.

మోహన్ లాల్.. అల్లు శిరీష్ తో పాటు అరుణోదయ్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అరుణోదయ్ పాక్ ఆర్మీని నడిపించే అధికారిగా నటించాడు.ఒకప్పుడు సైన్యంలో పని చేసి సినీ రంగంలోకి వచ్చిన మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీ శ్రీనివాస్ ఆర్ట్స్ బేనర్ మీద పూజా కాత్యాయని ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.