Begin typing your search above and press return to search.

టేబుల్ ప్రాఫిట్ తో ఖుషీ ఖుషీ

By:  Tupaki Desk   |   11 Feb 2016 7:30 PM GMT
టేబుల్ ప్రాఫిట్ తో ఖుషీ ఖుషీ
X
దూకుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ గా ఎదిగిన రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర.. ఆ తరువాత మహేష్ బాబుతో తీసిన ఆగడు, 1(నేనొక్కడినే) ఫ్లాపులతో ఆర్థికంగా బాగా కుదేలయ్యారు. ఈ రెండు సినిమాలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. దాంతో ఇసారి ఓ మినిమం బడ్జెట్టు సినిమాను తెరకెక్కించి లాభాల బాట పట్టారు. మహేష్ వల్ల నష్టపోయిన ఈ ముగ్గురు నిర్మాతలు... ఇప్పుడు లాభాల బాట పట్టారని ఫిలింనగర్ టాక్. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్లో హను రాఘవపూడి దర్శకత్వంలో నానితో కలిసి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాను నేనొక్కడినే తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లారు ఈ నిర్మాతలు. ఆ సినిమాను ఎంతో ప్యాషన్ తో పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పటి వరకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీసిన లవ్ స్టోరీలన్నీ సక్సెస్ అయ్యాయి. అదే ఫార్ములాను నమ్మి.. ఈ నిర్మాతలు కృష్ణగాడి వీర ప్రేమగాథను నిర్మించారు.

గత అనుభవాలు నేర్పిన గుణపాఠమో ఏమోగానీ ఈ సినిమాను విడుదలకు ముందే ఔట్ రేట్ కు అమ్మేశారు ఈ నిర్మాతలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెస్టాఫ్ తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.15కోట్లకు అభిషేక్ పిక్చర్స్ సంస్థకు అమ్మేశారు. తమ వద్ద కేవలం ఓవర్సీస్ రైట్స్ ను మాత్రమే ఉంచుకున్నారు. గతంలో భలే భలే మగాడివోయ్ సినిమాకు ఓవర్సీస్ లో బాగా కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్6 సినిమాల్లో నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా కూడా ఒకటి. దాంతో ఈ నిర్మాతలు ఓవర్సీస్ ను సొంతంగానే 130 స్క్రీన్లలో ప్రదర్శించబోతున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ ను కూడా జెమినీ సంస్థకు రూ.4 కోట్లకు విక్రయించారు. కేవలం పదిన్నర కోట్ల రూపాయల బడ్జెట్టుతో నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ను సుమారు రూ.15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ కు అమ్మేసి లాభాల్లో వున్నారు ఈ త్రిముర్తులు.