Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్లాపులతో గుణపాఠం..

By:  Tupaki Desk   |   11 Feb 2016 9:30 AM GMT
మహేష్ ఫ్లాపులతో గుణపాఠం..
X
చాలా తక్కువ కాలంలోనే 14 రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్ క్రేజీ బ్యానర్ గా పేరు సంపాదించేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ తో వరుస సినిమాలు చేసేయడం ఈ సంస్థను టాప్ స్టేజ్ కి తీసుకెళ్లింది. అయితే అంతే వేగంగానూ కిందకు కూడా పడిపోయిన పరిస్థితి 14రీల్స్ కి ఎదురైంది.

మహేష్ తో చేసిన 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాల పరాజయం తర్వాత 14 రీల్స్ చాలా జాగ్రత్తపడాల్సి వచ్చింది. కంటెంట్ తో పాటు.. డ్యురేషన్ కూడా ఈ మూవీస్ ఫెయిల్యూర్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. కనీసం మూడు గంటల నిడివితో సినిమాలు తీయడంతో.. జనాలకు బోర్ కొట్టేసింది. ఈ ఫెయిల్యూర్స్ తర్వాత వీళ్లు చాలానే జాగ్రత్తలు పడడం మొదలుపెట్టారు. రేపు రిలీజ్ అవుతున్న నాని మూవీ కృష్ణగాడి వీర ప్రేమగాధ విషయంలోనూ డ్యురేషన్ పై చాలానే చర్చలు జరిగాయి. అయితే.. ఈ నేచురల్ స్టార్ సినిమా మొత్తం రన్ టైం 148 నిమిషాలు మాత్రమే. అంటే 2గంటల 28 నిమిషాలతో సినిమాని సరిపెట్టేశారన్న మాట.

ఇది పాత ఫ్లాపుల నుంచి నేర్చుకున్న గుణపాఠమే అనే టాక్ ఉంది. తమ సినిమ నిడివి టైటిల్స్ - స్మోకింగ్ యాడ్స్ కాకుండా 2గంటల 22 నిమిషాలు మాత్రమే అని చెప్పారు అనిల్ సుంకర. అలాగే సినిమా లెంగ్త్ పై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, స్టోరీ చెప్పడానికి ఎంత సమయం అవసరమో అంతే నిడివి ఉంటుందన్న రామ్ ఆచంట.. ఏ మాత్రం ఎక్కువ, తక్కువ ఉండదని చెప్పారు.