Begin typing your search above and press return to search.

నితిన్ ప్రీ లుక్ కొత్తగా ఉందే

By:  Tupaki Desk   |   28 March 2017 1:35 PM GMT
నితిన్ ప్రీ లుక్ కొత్తగా ఉందే
X

అ..ఆ.. మూవీతో రికార్డు వసూళ్లు సాధించిన నితిన్.. త్రివిక్రమ్ అండతో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. తన తర్వాత సినిమా ఆ రేంజ్ ను నిలబెట్టేదిగా ఉండాలని భావించి.. లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ చివరకు ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. నానికి కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి సక్సెస్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ కొత్త సినిమా రూపొందుతోంది.

ఇప్పుడీ మూవీకి ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ ఇవ్వనుండగా.. ముందు రోజున ప్రీ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు నితిన్. మొహం సరిగా కనిపించకుండా.. ఓ మిర్రర్ కి అటువైపు నుంచుని పెయింటింగ్ వేస్తున్న నితిన్ ఈ పోస్టర్ లో మనకు కనిపిస్తాడు. పెయింట్ బ్రష్ చేతిలో పట్టుకోగా.. నితిన్ వేసిన పెయింట్ పైనా.. 30వ తేదీన ఫస్ట్ లుక్ అంటూ డిజైన్ చేసిన విధానం బాగుంది.

14 రీల్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి.. ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టెయినర్ లో నితిన్ కి జోడీగా మేఘా ఆకాష్ కనిపించనుండగా.. త్వరలో ఈ మూవీ షూటింగ్ కోసం అమెరికా వెళుతున్నారు యూనిట్. అక్కడ 2 నెలల పాటు చేసే షూటింగ్ తో.. దాదాపుగా సినిమా కంప్లీట్ అయిపోనుందట.