Begin typing your search above and press return to search.

మహేష్ కి, అడ్డాల మధ్య వారం అడ్డు

By:  Tupaki Desk   |   2 May 2016 5:30 PM GMT
మహేష్ కి, అడ్డాల మధ్య వారం అడ్డు
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం షూటింగ్.. ఇప్పుడు చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా.. ప్రస్తుతం ఓ పాటను పిక్చరైజ్ చేస్తున్నారు. ప్రణీత - కాజల్ అగర్వాల్ ల షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా.. సమంతకు సంబంధించిన సాంగ్స్ వర్క్ నడుస్తోంది. ఇది 10 రోజులైనా పడుతుందని టీం అంటోంది.

ఇది కూడా కంప్లీట్ చేసేసి ఈ నెల 20కి రిలీజ్ చేసేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడు, ఈ డెడ్ లైన్ విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. 20వ తేదీకి విడుదల చేయాలంటే కనీసం 15వ తేదీ నాటికే సెన్సార్ చేయించాల్సి ఉంటుంది. 10 రోజుల షూటింగ్ తర్వాత మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి కేవలం 4 రోజులే మిగులుతుంది. అందుకే.. ఈ నెల 27కు విడుదల చేద్దామని ప్రతిపాదిస్తున్నాడట.

అయితే.. ఇలా 20వ తేదీ అని పట్టుబట్టడంలో ప్రత్యేకమైన కారణం.. వేసవి సెలవలే. మే 27న విడుదల అంటే.. జూన్ 1తర్వాత చాలామందికి హాలిడేస్ అయిపోతాయి. అందుకే సమ్మర్ సీజన్ ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చని మహేష్ యోచిస్తున్నాడు. కానీ అంత హడావిడిగా పూర్తి చేస్తే వర్క్ బర్డెన్ తో పాటు.. ఔట్ పుట్ తేడా వచ్చే అవకాశాలు ఉండడంతో.. ఈ నెల 27ను అడుగుతోందట యూనిట్. ఏమైనా 20న కానీ - 27న కానీ బ్రహ్మోత్సవం విడుదల ఖాయమైపోయినట్లే.