క్యాస్టింగ్ డైరెక్టర్ పై #మీటూ ఆరోపణలు

Thu Dec 06 2018 21:19:54 GMT+0530 (IST)

#మీటూ కాంపెయిన్ మొదలైన నాటి నుండి ఎంతో మంది మహిళలు తమకెదురైన లైంగిక వేధింపులను ధైర్యంగా బయట పెడుతున్నారు. ఇలా ఆరోపణలు చేసే కొందరు తమ ఐడెంటిటీ ని బయటపెడుతున్నారు కానీ మరొకొందరు మాత్రం అజ్ఞాతంగా ఉంటూనే ఆరోపణలు చేస్తున్నారు.  తాజాగా కోలీవుడ్ లో ఒక పాపులర్ క్యాస్టింగ్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.తమిళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కోచ్ కు పరాకాష్టగా భావిస్తున్న ఈ ఉదంతంలో సదరు క్యాస్టింగ్ డైరెక్టర్ అవకాశాల పేరిట దాదాపు యాభై మంది ఔత్సాహిక నటీమణులను లోబరుచుకున్నాడని ఒక కొలీవుడ్ నటి ఆరోపించింది.  జస్ట్ ఆరోపణలే కాకుండా ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ కు సంబంధించిన ఒక వీడియోతో పాటుగా పలు ఆడియో టేపులు కూడా లీక్ చేసింది. ఈ ఆడియో టేపుల్లో ఆరోపణ చేస్తున్న మహిళ ఫ్రెండుకు .. క్యాస్టింగ్ డైరెక్టర్ కు మధ్య జరిగిన సంభాషణలు ఉన్నాయి.

ఇప్పటికే చిన్మయి ఆరోపణల వ్యవహారం కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది.  తాజాగా ఈ క్యాస్టింగ్ డైరెక్టర్ వ్యవహారం ఓ హాట్ టాపిక్ గా మారింది. కానీ #మీటూ వ్యవహారంలో మెజారిటీ కేసెస్ లో జరిగినట్టే ఈ విషయం ఇంకా పోలీసు కేసుల వరకూ వెళ్ళలేదు.