Begin typing your search above and press return to search.

టాప్ బ్యూటీస్ పై మీటూ రిట‌న్ గిఫ్ట్‌!

By:  Tupaki Desk   |   26 May 2019 2:30 PM GMT
టాప్ బ్యూటీస్ పై మీటూ రిట‌న్ గిఫ్ట్‌!
X
మీటూ ఉద్య‌మం మున‌గ చెట్టెక్కిందా? 2018 ఆద్యంతం ఓ ఊపు ఊపేసిన ఈ ఉద్య‌మం గురించి ప్ర‌స్తుతం ఎక్క‌డా మాట మాత్ర‌మైనా వినిపించ‌డం లేదు. బాలీవుడ్ లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వాళ్లంతా ఒక‌రొక‌రుగా కోర్టుల గొడ‌వ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఆధారాల్లేని ఆరోప‌ణ‌లుగా చాలా కేసులు వీగిపోతున్న నేప‌థ్యంలో ఇక మీటూ ఉద్య‌మానికి చెక్ ప‌డిన‌ట్టేనంటూ ఇటీవ‌ల అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ సాగింది. వేధింపుల రాయుళ్లకు రీబూట్ అయ్యే ఆయాచిత వ‌రం అన్న‌ సందేహాలు వ్యక్త‌మ‌య్యాయి. పోరాటం సాగించిన న‌టీమ‌ణులు కేసులు ఓడితే మాన్ స్ట‌ర్స్ కి బూస్ట్ ఇచ్చిన‌ట్టేన‌ని విశ్లేషించారు.

అయితే ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ లో ఆరుగురు మ‌హిళ‌ల‌తో కూడుకున్న వ్వావ్ బృందం మ‌రింత‌గా యాక్టివిటీస్ పెంచుతోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌తో పాటు ఇరుగు పొరుగున‌.. బాలీవుడ్ లోనూ వాయిస్ ఆఫ్ ఉమెన్ (వ్వావ్) - ఉమెన్ ఇన్ సినిమా క‌లెక్టివ్ (డ‌బ్ల్యూసీసీ) వింగ్ యాక్టివిటీస్ ని విస్త‌రిస్తోంది. ఇక ఈ క‌మిటీ వేధింపుల‌కు గురైన క‌థానాయిక‌ల్ని.. ఇత‌ర‌త్రా న‌టీమ‌ణుల్ని త‌మ వాయిస్ ఓపెన్ గా వినిపించాల్సిందిగా కోర‌బోతోంద‌ట‌. ఆన్ లైన్ లోనూ ఫిర్యాదులు స్వీక‌రిస్తూ ఆన్ లొకేషన్ ఒక బాక్స్ ద్వారా ఫిర్యాదులు స్వీక‌రించే వ్య‌వ‌స్థ‌ను అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ విస్త‌రిస్తున్నార‌ట‌.

అయితే ఎవ‌రు ఉద్య‌మం చేసినా.. మీటూలో బ‌య‌ట‌ప‌డిన న‌టీమ‌ణుల‌కు అవ‌కాశాలు ఇచ్చేందుకు పరిశ్ర‌మ వెన‌క‌డుగు వేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు సూచిస్తున్నారు. న‌టి శ్రీ‌రెడ్డి.. గాయ‌ని సుచిత్ర .. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి స‌హా ప‌లువురు అవ‌కాశాలు కోల్పోవ‌డం గురించి చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వీళ్ల‌ను పిలిచి ఎవ‌రూ అవ‌కాశాలివ్వ‌డం లేద‌న్న ఎగ్జాంపుల్ ని చూపిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా మీటూ ఉద్య‌మంపై ప‌లు మీడియాల్లో కామెంట్లు చేసిన ప‌లువురు స్టార్ హీరోయిన్ లు ఓపెన్ గా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం చెప్పుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డార‌ని ఇన్న‌ర్ గా చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ మీటూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళుతున్న ధీర‌వ‌నిత‌లుగా పేరు బ‌డితే ఇక కెరీర్ ఖ‌త‌మ్ అన్న భయాందోళ‌న వీళ్ల‌లో ఉంద‌ని ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ ఉద్య‌మాల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్లకు జీరో ఛాన్సెస్ అన్న విశ్లేష‌ణ సాగుతోంది. మాన్ స్ట‌ర్స్ మార‌రు. రూపం మార్చుకుంటారంతే! ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపులు త‌గ్గ‌వు.. రూపం మార్చుకుంటాయి! అంటూ దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇలాంట‌ప్పుడు ఎదురు తిరిగి క‌మిట్ మెంట్ కి అంగీక‌రించ‌క‌పోతే .. ఛాన్సులు క‌ష్ట‌మేన‌నిని ఓ ప్ర‌ముఖుడు పిచ్చా పాటీలో వ్యాఖ్యానించ‌డాన్ని బ‌ట్టి సీన్ అంతా రివ‌ర్సులోనే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలా మీటూ వేదిక‌గా బ‌య‌ట‌ప‌డ‌ద‌లిస్తే.. సొంతంగా సినిమాలు తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఎవ‌రైనా ఛాన్సులివ్వాలి ఉంటుంది. ఆ స్థాయి ఉంటేనే గో అహెడ్! అన్న వాద‌న తెర‌పైకి రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండ‌స్ట్రీస్ లో ఉన్న టాప్ బ్యూటీస్ త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌హిరంగంగా చెప్పుకోవ‌డంలో త‌డ‌బ‌డ‌డంపై నిరంత‌రం హాట్ హాట్ గా చ‌ర్చ సాగుతూనే ఉంది. త‌మ‌కు అలాంటి స‌న్నివేశం ఎదురు కాలేద‌నో.. లేక ఎదురైనా తిర‌స్క‌రించామ‌నో చెబుతున్నారు త‌ప్ప వాస్త‌వం మాట్లాడ‌డం లేద‌న్న వాద‌న చాలా కాలంగా వినిపిస్తున్న‌దే. ఇక కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేయ‌డం పేరుతో ఇప్ప‌టికే ఉన్న సీనియ‌ర్ల‌ను మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌క్క‌న బెట్టేస్తున్నార‌న్న‌ది మ‌రో బ‌హిరంగ ర‌హ‌స్యం.