#సెక్స్ రాకెట్.. ఆ 14 లక్షలతో గుట్టు రట్టు

Wed Jun 20 2018 14:11:33 GMT+0530 (IST)

అమెరికా కేంద్రంగా టాలీవుడ్ హీరోయిన్లు.. యాంకర్లతో నడుపుతున్న సెక్స్ రాకెట్ కు సంబంధించి ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిన్న-మధ్య స్థాయి హీరోయిన్లతో పాటు కొందరు యాంకర్లు ఉన్నట్లుగా వెల్లడవుతోంది. ఈ రాకెట్ కు సంబంధించి వెలుగులోకి వచ్చిన విచారణ నివేదిక ప్రకంపనలు రేపుతోంది. అందులో పేర్కొన్న విషయాల్ని బట్టి ఎవరెవరు సెక్స్ రాకెట్లో భాగస్వాములో ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు నెటిజన్లు. వ్యభిచార రాకెట్ ను నడపడంలో కిషన్ మోదుగుమూడి.. చంద్రకళ దంపతులు చూపించిన తెలివితేటలకు విస్తుబోతున్నారందరూ.ఐతే యుఎస్ పోలీసులు ఈ రాకెట్ గుట్టు బయట పెట్టడానికంటే ముందు ఈ వ్యవహారం గురించి హైదరాబాద్ పోలీసులకే సందేహాలు కలిగాయట. అమెరికాలో ఈవెంట్లలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వచ్చేటపుడు హీరోయిన్లు యాంకర్లు ఎయిర్ పోర్టుల్లో పెద్ద మొత్తంలో డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడానికి కొంత కాలంగా గమనిస్తున్నారు పోలీసులు. కొన్ని నెలల కిందట ఒక హీరోయిన్ వెళ్లేటపుడు ఉత్త చేతుల్తో వెళ్లి వచ్చేటపుడు పెద్ద మొత్తంలో కరెన్సీ ఎక్స్ ఛేంజ్ చేసుకుందట. ఆ మొత్తం రూ.14 లక్షలని సమాచారం. తెలుగులో నాలుగు సినిమాలు.. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఆ హీరోయిన్ కు ఆ డబ్బులు ఎలా వచ్చాయన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆమె హాలీవుడ్లో సినిమాలేమీ చేయలేదు. అలాగే అక్కడామెకు వేరే వ్యాపారాలూ లేవు. ఇదే విషయాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా లేవనెత్తాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సదరు హీరోయిన్ అంత పెద్ద మొత్తంలో కరెన్సీ ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం వెనుక రహస్యమేంటని శివాజీరాజా ప్రశ్నించాడు. పోలీసులకు కూడా ఈ విషయంలో సందేహం కలిగి దీనిపై కూపీ లాగే ప్రయత్నం చేశారట. యుఎస్ పోలీసులు కూడా కొన్ని విషయాలపై ఇక్కడి పోలీసు వర్గాల నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది.