ఫోటో స్టోరీ : #RRR మొదలైంది

Mon Nov 19 2018 10:17:18 GMT+0530 (IST)

దాదాపు సంవత్సర కాలంగా ఊరిస్తూ వస్తున్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల మల్టీస్టారర్ మూవీని ఎట్టకేలకు పట్టాలెక్కించాడు జక్కన్న. భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దాదాపు సంవత్సరం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ చిత్రం నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. మొదటి రోజు రామ్ చరణ్ పై కొన్ని సీన్స్ తీయబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. నేడు షూటింగ్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇద్దరు కూడా పాల్గొన్నారు.తెల్లవారు జామునే కోకాపేట్ లోని చిత్రం సెట్ కు వీరు చేరుకున్నారు. షూటింగ్ ప్రారంభించే ముందు ఈ ఫొటో తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా మేకప్ కాలేదు కనుక షూటింగ్ మొదలు పెట్టలేదని అనుకోవచ్చు. రామ్ చరణ్ న్యూ మేకోవర్ తో కనిపిస్తాడని ఎన్టీఆర్ కాస్త లావుగా కనిపిస్తాడని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తపై క్లారిటీ రావాలి అంటే ఫస్ట్ లుక్ పోస్టర్స్ వస్తే కాని అసలు విషయం క్లారిటీ రాదు. సినిమా ప్రారంభం అయ్యిందని ఫొటో పోస్ట్ చేసిన జక్కన్న తర్వాత ఫొటోను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తాడా అంటూ అప్పుడే ఎదురు చూపు మొదలు అయ్యాయి.

ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫొటోలో వెనుక పెద్ద క్రేన్ ఉన్న కారణంగా మొదటి రోజే ఏదో పెద్ద యాక్షన్ సీన్ జక్కన్న తెరకెక్కిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ చిత్రం మరోసారి సంచలనాలు సృష్టించడం ఖాయం అని ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 2020లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.