Begin typing your search above and press return to search.

RRR అప్పుడే క‌థ‌ లీక్

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:26 AM GMT
RRR అప్పుడే క‌థ‌ లీక్
X
రామారావు-రామ్‌ చ‌రణ్ కాంబినేష‌న్‌ లో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఈనెల 11న అత్యంత గ్రాండ్‌ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ దిగ్గ‌జాల న‌డుమ భారీ సెట్స్‌ లో సినిమాని ప్రారంభించారు. హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ ప‌రిస‌రాల్లోని సెట్స్‌లో ఈనెల 19 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది టీమ్. ఆరంభ‌మే ఈ సెట్స్‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ ని తెర‌కెక్కించేందుకు జ‌క్క‌న్న ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. బాహుబ‌లిని మించి.. 300 కోట్ల బ‌డ్జెట్‌ తో డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా క‌థాంశం ఏంటి? అన్న క్యూరియాసిటీ అభిమానుల్లో ఉంది. ఇంత‌కీ క‌థ ఏంటి? అన్న డిస్క‌షన్ మెగా-నంద‌మూరి అభిమానుల్ని వేడెక్కిస్తోంది. ఈ సినిమా క‌థ గురించి ఇప్ప‌టికే బోలెడంత ప్ర‌చారం సాగింది. ఇదో పీరియాడిక‌ల్ సినిమా. ఇందులో చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్ బాక్స‌ర్లుగా న‌టిస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ సామాజిక మాధ్య‌మాల్లో క‌థ‌ను లీక్ చేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థాంశాన్ని రాజ‌మౌళి ఎంచుకున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్టును అందించారు. ఇది దొంగా పోలీస్ క‌థ‌. ఇందులోనే బాక్సింగ్ నేప‌థ్యం ఇన్‌ బిల్ట్ చేశార‌ట‌. 1920 లో సాగే ఆస‌క్తిక‌ర క‌థాంశ‌మిది. చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ లుక్ ప‌రంగా చాలా కొత్త‌గా క‌నిపిస్తార‌ని చెబుతున్నారు.

ఈనెల 19 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తున్నారు. ఆరంభ‌మే ఎన్టీఆర్‌ - చ‌ర‌ణ్‌ పై దొంగా పోలీస్ ఛేజ్ దృశ్యాల్ని తీస్తున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఒక ర‌కంగా ఇదే నిజ‌మైతే క‌థ లీక్ చేసిన‌ట్టే. ఇక ఈ చిత్రాన్ని తెలుగు - త‌మిళం - హిందీ భాష‌ల్ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కిస్తున్నారు. ఇండియాలోని అన్ని భాష‌ల్లో అనువ‌దించి రిలీజ్ చేయ‌నున్నారు. అలానే `బాహుబ‌లి` సిరీస్‌ తో వ‌చ్చిన గుర్తింపు, స‌క్సెస్ వ‌ల్ల‌ చైనా - జ‌పాన్‌ లోనూ రిలీజ్ ప్లాన్ ఉందని ముచ్చ‌టించుకుంటున్నారు. జ‌క్క‌న్న ప్రాజెక్టుకి ఆర్కా మీడియా - వారాహి చ‌ల‌న‌చిత్రం అంత‌టి పెద్ద సంస్థ‌ల వెన్నుద‌న్ను ఉంద‌ని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి క‌ర‌ణ్ జోహార్ అండ‌దండ‌లు ఉండ‌నే ఉన్నాయి.