Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ కు టార్గెట్లు షురూ!

By:  Tupaki Desk   |   22 Aug 2019 1:30 AM GMT
ఆర్ ఆర్ ఆర్ కు టార్గెట్లు షురూ!
X
ఇంకా విడుదలకు చాలా టైం ఉంది అప్పుడే టార్గెట్లు ఏమిటి అనుకోకండి. విషయం వేరే ఉంది. టాలీవుడ్ లో ఎన్నడూ లేని రీతిలో కేవలం నెల రోజుల గ్యాప్ లో రెండు అతి పెద్ద విజువల్ వండర్స్ అందులోనూ చెరి రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన సినిమాలు వస్తుండటంతో మూవీ లవర్స్ ఆనందం మాములుగా లేదు. ముందు వచ్చేది సాహో కాబట్టి నాన్ బాహుబలి రికార్డులను సెట్ చేస్తుందా లేదా అనేదాని మీద ట్రేడ్ కన్నేసింది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం అంత పనీ జరిగే తీరుతుంది.

అప్పుడు తర్వాతి భారం సైరా మీద ఉంటుంది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా తన స్టామినా ఖైదీ నెంబర్ 150తో రుజువు చేసిన చిరంజీవికి ఇప్పుడు అసలు పరీక్ష ఎదురు కానుంది. స్వంత పెట్టుబడి (చరణ్ దే అయినప్పటికీ) కావడంతో రిస్క్ మొత్తం ఫ్యామిలీనే మోయాల్సి ఉంది. మాములు హిట్ అయితే సైరాకు లాసే. హిట్ అనిపించుకుంటేనే సేఫ్ గా నిలుస్తుంది. దీనికీ బాహుబలి తరహా ఫలితం వస్తే వసూళ్ల ఊచకోత చేయడం చిరుకి కొత్తేమి కాదు

ఈ రెండు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేస్తాయి అనేదాన్ని బట్టి వచ్చే జూలైలో రానున్న ఆర్ఆర్ఆర్ కు టార్గెట్లు ఉంటాయి. తాను సృష్టించిన రికార్డుల పర్వాన్ని తానే అధిగమించాల్సిన బాధ్యత బరువు రాజమౌళితో పాటు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల మీద ఉంటుంది.

సాహో కానీ సైరా కానీ బాహుబలిని దాటేసి ఏ ఐదు వందల కొట్లో లేదా వెయ్యి కోట్లో లెక్కలు రాబడితే దాన్ని క్రాస్ చేసే దిశగా ఆర్ ఆర్ ఆర్ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అసలే బాలీవుడ్ మేకర్స్ ఈర్ష్యతో రగిలిపోయే స్థాయిలో తెలుగు సినిమాలు రూపొందుతున్నాయి. అలాంటిది ఈ మూడు కనక చరిత్ర సృష్టిస్తే బడా బడా ముంబై ప్రొడ్యూసర్లు కూడా హైదరాబాద్ లో ఆఫీసులు ఓపెన్ చేయాల్సిందే. ఆ రోజు దగ్గర్లోనే ఉంది.