ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ : రిలీజ్ డేట్

Thu Mar 14 2019 12:37:13 GMT+0530 (IST)

ఆశించినట్టుగానే ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ చాలా సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చేసింది. జాప్యం చేసినా క్వాలిటీ విషయంలో రాజీ పడని దర్శకుడిగా పేరున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనే అనుమానాలు అభిమానులను వెంటాడుతు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ నిర్మాత డివివి దానయ్య అధికారికంగా 2020 జులై 30 అని ప్రకటించేశారు.అప్పటి దాకా సైలెంట్ గా మీడియా ప్రతినిధులు దీనికి గట్టిగా చప్పట్లు కొడుతూ మద్దతు పలకడం గమనార్హం. కేవలం ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే ఆర్ ఆర్ ఆర్ చూడొచ్చన్న స్పష్టత వచ్చేయడంతో ఫ్యాన్స్ కి కూడా ఇది గుడ్ న్యూస్. మగధీర బాహుబలి తరహాలోనే రాజమౌళి ఈ సారి కూడా సమ్మర్ నే టార్గెట్ పెట్టుకున్నాడు.

కాకపోతే వేసవి ముగిసిన టైం వాతావరణం పరంగా సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి భారీ సినిమాల ఓపెనింగ్స్ కు బాగుంటుంది కాబట్టి మరోసారి చాలా తెలివైన ఎత్తుగడతో జులై 30 ని ఎంచుకున్నారు.. మగధీర పదేళ్ల క్రితం జులై 31 విడుదల కావడం గమనార్హం. సో సరిగ్గా 14 నెలలు ఓపిక పడితే ఆర్ ఆర్ ఆర్ థియేటర్లలోకి అడుగు పెడుతుంది. ఇక కీలకమైన సస్పెన్స్ కు ముడి వీడింది కాబట్టి ఇకపై షూటింగ్ అప్ డేట్స్ తో పాటు ఫస్ట్ లుక్స్ టీజర్స్ కోసం వెయిట్ చేయడమే మిగిలుంది