Begin typing your search above and press return to search.

వైర‌ముత్తుపై రెహ‌మాన్ సోద‌రి బ్లాస్ట్!

By:  Tupaki Desk   |   23 Oct 2018 1:30 AM GMT
వైర‌ముత్తుపై రెహ‌మాన్ సోద‌రి బ్లాస్ట్!
X
``ఆయ‌న రొమాన్స్ ఇండ‌స్ట్రీలో ఓ ఓపెన్ సీక్రెట్`` అంటూ బాంబ్ పేల్చారు స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్.రెహ‌మాన్ సోద‌రి ఏ.ఆర్.రెహానా. అందులో కొత్త‌గా వినేదేం లేదు. రెగ్యుల‌ర్‌ గా వినేద‌న‌ని పెద్ద షాకిచ్చారు. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటారా.. ఆయ‌నే వైర‌ముత్తు. ప్ర‌ముఖ గాయ‌ని - డ‌బ్బింగ్ ఆర్టిస్టు చిన్మ‌యి - త‌న‌తో పాటే మ‌రికొంత‌మంది గాయ‌ణీమ‌నులు వైర‌ముత్తుపై లైంగికంగా వేధించాడ‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీలో ఇలాంటివి విన‌డం త‌న‌కు కొత్తేమీ కాద‌ని - వైర‌ముత్తు గురించి అంతా ఓపెన్ సీక్రెటేన‌ని ఖ‌రాకండిగా చెప్పారు రెహానా.

చిన్మ‌యి పోరాటం త‌ప్పు కాదు. కానీ 15 ఏళ్ల త‌ర్వాత ఇలా చేయ‌డ‌మేంటో అర్థం కావ‌డం లేదు. తాను ఆరోజే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల్సింద‌ని సూచించారు. వైర‌ముత్తును తాను కూడా ప‌లుమార్లు క‌లిశాన‌ని - అయితే ఆయ‌న ఎంతో హుందాగానే వ్య‌వ‌హ‌రించార‌ని - త‌న‌కు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేద‌ని రిహానా తెలిపారు. చిన్మ‌యి ఆరోప‌ణ‌ల అనంత‌రం ఏ.ఆర్‌.రెహ‌మాన్ దీనిపై త‌న‌ని ఫోన్ చేసి అడిగార‌ని తెలిపారు. వైర‌ముత్తు విష‌యంలో ఆర‌ప‌ణ‌లు విన్న త‌ర్వాత‌ రెహ‌మాన్ షాక‌య్యర‌ని వెల్ల‌డించారు.

``వైర‌ముత్తు గురించి ఇదివ‌ర‌కెపుడో కొంద‌రు మ‌గువ‌ల నాతో చెప్పారు. ఆయ‌న బిహేవియ‌ర్ ఓ ఓపెన్ సీక్రెట్‌. అయితే నాకు త‌న‌తో అలాంటి ఘ‌ట‌న‌లు ఎదురు కాలేదు. ఎందుకంటే నేను హుందాగా ఉన్నాను గ‌నుక‌. అందుకే అలాంటి విష‌యాలు చాలా మంది నాతో మాట్లాడేందుకే ఇష్ట‌ప‌డ‌రు`` అని కుండ బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ మాట్లాడారు రెహానా. ఆయ‌నపై ఇన్ని ఆరోప‌ణ‌లు చేసిన‌వాళ్లు ఎవ‌రూ మొగ్గ‌లోనే ఎందుకు తుంచేయ‌లేదో? చిన్మ‌యి అత‌డిని పెళ్లికి ఎందుకు పిలిచిన‌ట్టు. పైగా ఆయ‌న ఆశీస్సులు ఎందుకు తీసుకున్న‌ట్టు? ఈ టైపు యాక్టింగ్ అవ‌స‌రం లేదేమో? ఆరంభ‌మే దూరం పెట్ట‌డం అవ‌స‌రం క‌దా?.. అని చిన్మ‌యి ప్ర‌వ‌ర్త‌ను తూర్పార‌బ‌ట్టారు రెహానా. వేధింపుల విష‌యంలో ఆయ‌నొక్క‌డినే ఎలా త‌ప్పు ప‌డుతున్నారు? చాలామంది సింగ‌ర్ల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వాళ్ల‌ను ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. అంద‌రిపైనా అంతే పెద్ద‌గా యుద్ధం చేయాలి.. అనీ ఖ‌రాకండిగా త‌న వైఖ‌రిని తెలియ‌ప‌రిచారు. వైర‌ముత్తు త‌న‌ని ఎలాంటి వేధింపుల‌కు గురి చేయ‌లేదు కాబ‌ట్టి, త‌న గురించి నేను మాట్లాడ‌డం స‌రికాద‌ని అన్నారు. మొత్తానికి `ఓపెన్ సీక్రెట్‌` అంటూ అంతా ఓపెన్‌గానే చెప్పేశారు మాంత్రికుడి సోద‌రి.