Begin typing your search above and press return to search.

మహేష్ సినిమా లాంచ్ కు సూపర్ ఆకేషన్

By:  Tupaki Desk   |   21 May 2019 5:39 PM GMT
మహేష్ సినిమా లాంచ్ కు సూపర్ ఆకేషన్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. 'మహర్షి' రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్న మహేష్ ప్రమోషన్స్ పూర్తి కాగానే తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్ళాడు. మహేష్ మరో 25 రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగివస్తాడని సమాచారం. అయితే మహేష్ తిరిగి వచ్చే లోపు మహేష్ నెక్స్ట్ సినిమా లాంచ్ కార్యక్రమం పూర్తవుతుందట.

మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 న లాంచ్ చేస్తారట. మహేష్ సినిమా లాంచ్ చేసేందుకు ఇంతకంటే బెస్ట్ అకేషన్ ఏముంటుంది చెప్పండి? అయితే మహేష్ లేకుండా ఎందుకు లాంచ్ చేస్తున్నారు అంటే.. మహేష్ తన సినిమా లాంచ్ కు హాజరు కాడు.. మహేష్ కు అదో సెంటిమెంట్. దాదాపుగా మహేష్ గత సినిమాల లాంచ్ కార్రక్రమాలకు మహేష్ హాజరయిన సందర్భం లేదు. సో.. ఈ సినిమాకు కూడా మహేష్ సేమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడన్నమాట.

ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తికాలేదని.. అనిల్ రావిపూడి టీమ్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ ఆఖరున ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా రష్మిక మందన్నను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. 'F2' తో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడితో మహేష్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది.