Begin typing your search above and press return to search.

నౌకలోనే చౌక.. షిప్ జీవనమే మిన్న

మనిషికి వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందట. చావు నీది.. బతుకు నీది.. బతుకు దేశానికి అన్నారు కాళోజీ

By:  Tupaki Desk   |   27 Dec 2023 4:30 PM GMT
నౌకలోనే చౌక.. షిప్ జీవనమే మిన్న
X

మనిషికి వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందట. చావు నీది.. బతుకు నీది.. బతుకు దేశానికి అన్నారు కాళోజీ. మనిషి బతకడానికి పలు మార్గాలు ఎంచుకుంటాడు. ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు తమ బతుకు మార్గాన్ని వెతుక్కుంటారు. ఈ భూమి మీద నివసించాలంటే ఇల్లు ఉండాలి. దాంతో పాటు అన్ని రకాల బిల్లులు మనకు వస్తుంటాయి. నీటి బిల్లు, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు ఇలా పలు బిల్లులు చెల్లిస్తూనే ఉంటాం. వీటి వల్ల మనం ప్రతి నెల నిధులు చెల్లించాల్సిందే. అది భూమి మీద పుట్టిన ప్రతి వాడు చెల్లించుకునేదే.

కొందరు భూమి మీద నివసిస్తే మరికొందరు కొండల్లో కోనల్లో ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఇంకొందరు నౌకల్లో కూడా నివసించేందుకు మొగ్గు చూపుతారు. భూమి మీద బతకాలంటే బిల్లులు కట్టాల్సిందే. అదే సముద్రంలో అయితే మనం చెల్లించుకోవాల్సింది ఏమీ ఉండదు. ఉచితంగానే అన్ని సమకూరుతాయి. యుటిలిటీ బిల్లు, ఆటో బీమా, ఆస్తి బీమా తదితర విషయాలపై పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.

2020లో ఫ్లోరిడా (అమెరికా)లో జాన్, హెన్సెస్సీ దంపతులు ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులు అమ్మేశారు. వారి నివాసం క్రూయిజ్ షిప్ లోకి మార్చుకున్నారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్ లో 274 రోజుల ప్రయాణం కోసం టికెట్లు తీసుకున్నారు. ఇక మీదట ఇంటి అద్దె, వాహన బీమా, యుటిలిటీ బిల్లుల అవసరం లేకుండా వారు నౌకలోనే ప్రయాణం చేయనున్నారు.

వారు అందులో విల్లా వీ ఎంచుకున్నారు. శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. షిప్ లోనే ఉంటున్నారు. దీనిలోని ప్రయాణికుల్లో 30 శాతం మంది శాశ్వతంగా ఇందులోనే ఉంటారు. మిగిలిన 85 శాతం మంది ప్రయాణికులు అమెరికా వారే ఉంటారు. ఇలా నౌకలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవితం గడపడం కొత్తదనానికి నిదర్శనంగా చెబుతున్నారు.

ఈ షిప్ లో క్యాబిన్ ధర రూ. 99 వేల డాలర్లు. బాల్కనీలోని విల్లా ధర రూ.249 డాలర్లు. కిచెన్, లివింగ్ రూం, బెడ్ రూంలు ఉంటాయి. ఇందులోకి మారాక పోర్ట్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఇతర చార్జీలు ఏమీ ఉండవు. దీంతో ఇక్కడ నివాసం చౌకగా ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఇందులోనే ఉంటున్నారు. సముద్రంపైనే జీవనం కొనసాగిస్తున్నారు. షిప్ లోనే తలదాచుకుంటున్నారు.

ఈ భారీ నౌక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. వేడిగా ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంటుంది. భూమి మీద నివాసం కంటే నౌకలోనే కారుచౌకగా ఉంటుందని భావించి షిప్ లోనే జీవనం ఏర్పరుచుకుంటున్నారు. దీనికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి బాదర బందీ లేకుండా నౌకలోనే విహరిస్తున్నారు.