Begin typing your search above and press return to search.

మృదువైన చర్మం కావాలా...?

By:  Tupaki Desk   |   8 July 2015 7:52 AM GMT
మృదువైన చర్మం కావాలా...?
X
ఆడైనా, మగయినా... మనిషి అందంలో కీలక పాత్ర చర్మానిదే. తీరైన ముఖాకృతి, సొంపైన శరీరాకృతి ఉన్నా చర్మ సౌందర్యం లేకుంటే ప్రయోజనం లేదు. మరి అందం, ఆరోగ్యంలో ఎంతో కీలకమైన చర్మాన్ని సంరక్షించుకోవాలంటే పరిశుభ్రతతో పాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా అందం కోసం చర్మం మీద రకరకాల క్రీములను అప్లై చేస్తుంటారు. కానీ, మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకుంటే చాలు. పిగ్మెంటేషన్లు, అలర్జీలు రాకుండా ఇవి నివారిస్తాయి. వయసుకు తగ్గట్లుగా కనిపించాలంటే అలాంటి ఆహారాలు తీసుకోవాల్సిందే.

ఇవి తినండి...

పుదీనా: పుదీనా... ఆకు కూరలు బాగా తినేవారు కూడా దీన్ని నెగ్లెక్టు చేస్తుంటారు. గోంగూరు, తోటకూరలతో సరిపెట్టుకుంటారు. అవి కూడా శరీరానికి మంచివే అయినా చర్మ సౌందర్యం కోరుకునేవారు మాత్రం పుదీనా తినాలి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఫలితంగా చర్మం వన్నెలీనుతుంది.

పెరుగు: పెరుగు లో విటమిన్ సి మరియు మిక్క్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే క్యాల్షియం మరియు ప్రోటీన్స్ కలిగిన ఈ డైరీప్రొడక్ట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి.

ఆలివ్ నూనె: ఆలివ్ ఆయిల్, నూనెల్లో అన్నింటికంటే చాలా తక్కువ కొవ్వు కలిగిన నూనె ఆలివ్ ఆయిల్. సుద్దమైన ఆలివ్ ఆయిల్లో యాంటియాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మకణాలు మృతిచెందుతున్నా వాటి స్థానంలో వేగంగా కొత్తవి వచ్చేలా చేస్తాయి. ఫలితంగా చర్మం నిత్యనూతనంగా ఉంటుంది.

సాల్మన్: సాల్మన్ ఫిష్... దీన్నే తెలుగులో మాగ చేప అంటారు. కొన్ని చోట్ల బుడత మాగ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్ చేప తినేవారిలో చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.

రెడ్ బీన్స్, రాజ్ మా: రెడ్ బీన్స్, రాజ్ మాలో జింక్ ఉంటుంది. ఇది యాంటీ ఏజెనింగ్ గా పనిచేస్తుంది.

గుడ్డులోని పచ్చసొన: గుడ్డులోని పచ్చసొన పుష్కలమైన జింక్ మరియు సెలీనియం కలిగి ఉంటుంది. ఇది స్కిన్ సెల్ పునరుద్దరణ ప్రక్రియకు బాగా సహాయపడుతాయి. కానీ అధికంగా గుడ్డు తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి, స్కిన్ పగలడానికి కారణం కావచ్చు. కాబట్టి, రోజులో రెండు గుడ్లకు మించి తినకూడదు.

సన్ ఫ్లవర్ గింజలు: సన్ ఫ్లవర్ గింజల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇంకా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది.