ట్రెండ్: బొడ్డుకి అంగుళం పైకి కట్టు...

Sat Jul 25 2015 09:09:09 GMT+0530 (IST)

సుందరీమణుల నాభి అందాలను ఎక్స్ పోజ్ చేయడం సినిమాల్లో తరచుగా కనిపించేదే. బొడ్డు చుట్టూనే అనేక పాటలను తీయగల సత్తా ఉన్న డైరెక్టర్లు ఎందరో ఉన్నారు మన చిత్రసీమలో. ముఖ్యంగా దక్షిణాది మూవీల్లో ఈ నాభి ప్రదర్శన ఎక్కువగా ఉంటుంది. 'చీర బొడ్డు కిందకే కట్టాలమ్మా' అంటూ కూతురుకి తల్లి లెక్చర్లిచ్చిన సినిమాలు కూడా తెలుగులో వచ్చాయి.

ప్రైవేట్ ఫంక్షన్లకు కూడా మొన్నమొన్నటివరకూ ఇలా నాభి ప్రదర్శన చేసేలానే హీరోయిన్ల డ్రెసింగ్ ఉండేది. బొడ్డుకు బెత్తెడు కిందకి కట్టు ఉండే ట్రెండ్ నుంచి.. నాభికి అంగుళం పైకి డ్రస్సులు మారడం కొత్త ఫ్యాషన్ అయిపోతోంది. తాజాగా కొన్ని కార్యక్రమాలకు మన హీరోయిన్లు వేసుకొచ్చిన డ్రస్సులు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.

మిల్కీబ్యూటీ తమన్నా టీఎస్సార్ అవార్డ్స్ ఫంక్షన్ ముందురోజున జరిగిన కార్యక్రమానికి ఆలివ్ గ్రీన్ గోల్డ్ కలర్స్ తో స్లీవ్ లెస్ గాగ్రా ధరించి వచ్చింది. ఈ వైట్ టోన్ బ్యూటీ బొడ్డుపైకి కట్టి భలే చూడముచ్చటగా కనిపించింది. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కి హాజరైన ఆదాశర్మ రాశిఖన్నాలు కూడా నాభి పైకే డ్రస్సులు వేశారు. ఓ జ్యూవెల్రీ షోరూం చెన్నైలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆర్నమెంట్ కలెక్షన్‌ని లాంఛ్ చేసేందుకు వచ్చిన త్రిష కూడా... తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది. ఈ అమ్మడిది కూడా సేమ్ స్టైల్.

స్లీవ్ లెస్ టాప్ బొడ్డు పైకి స్కర్ట్. మొత్తం మీద సినిమాల్లో నాభి ప్రదర్శనతో కట్టిపడేసే ఈ సుందరాంగులు... బయట ఫంక్షన్ల లో డ్రసింగ్ విషయంలో మాత్రం నయా ట్రెండ్ సృష్టిస్తున్నారు.