వోగ్యు ఈవెంట్స్ లో సెలబ్రెటీల న్యూ లుక్స్!

Fri Jul 24 2015 11:26:54 GMT+0530 (IST)

ఫ్యాషన్ ఈవెంట్స్ లందు వోగ్యు ష్యాషన్ ఈవెంట్స్ ఒక ప్రత్యేకమైన ఈవెంట్ అనే చెప్పాలి. తాజాగా జరిగిన వోగ్యు బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీస్ రకరకాల డ్రెస్సుల్లో వచ్చి మెరిపించారు! ఫ్లోర్ స్వీపింగ్ గౌన్స్ లో రెడ్ కార్పెట్ పై మెరిసారు వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు! సాదారణంగా పూర్తి స్థాయిలో ఎక్స్ ఫోజింగ్ చేసే డ్రెస్సులు అత్యధిక శరీర భాగం కనిపించే దుస్తులే ఫ్యాషన్ అనుకునే జనాలున్న రోజుల్లో... వోగ్యు బ్యూటీ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద అలరించిన సెలబ్రెటీలు ఏమాత్రం అసభ్యకరమైన దుస్తులు ధరించ కుండా ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది డ్రెస్సులలో సిల్క్ గౌన్స్ ఫ్లోవీ గౌన్ డామినేట్ గా కనిపించాయనే చెప్పాలి. ఈ వోగ్యు బ్యూటీ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరైన కొంత మంది సెలబ్రెటీల న్యూ లుక్స్ ఒకసారి చూద్దాం...

ఈ ఈవెంట్ కు హాజరైన వారిలో అనుష్క శర్మ తెలుపు వర్ణ దుస్తుల్లో దేవతలా కనిపించిందని అభిమానులు తెగ మురిసిపోతున్నారు! నిజంగా కూడా అనుష్క శర్మ అలానే కనిపించింది వైట్ లాంగ్ గౌన్ లో! ఈ యువకథానాయికతో పాటూ సీనియర్ హీరోయిన్ మధుబాల ఈ వేడుకలో హల్ చల్ చేశారు! పూర్ణా జగన్నాథన్ స్కిప్డ్ గౌన్ చాలా అందంగా కనిపించింది. బ్రైట్ ప్రింటెడ్ స్కిచ్చీ ఫ్యూషన్ శారీలో స్వరా బాస్కర్ ఆశ్చర్యపరిచింది . వీరిలో స్వరా ధరించిన ఫ్యూషన్ శారీ భూమిక అరోరా గ్లిట్టరింగ్ బాల్మెయిన్ సీక్వెన్స్ డ్రెస్సు లో అద్భుతంగా కనిపించారు. ఈ కార్యక్రమంలో బాగా ఆకట్టుకున్న వారిలో మధుబాల లైట్ రెడ్ కలర్ గౌన్ లో కనిపించగా... తనీషా లైట్ పింక్ కలర్ ఫుల్ డ్రెస్లో స్వరభాస్కర్ ఫ్యూషన్ శారీలో నేహ దుపియా నీలిరంగు దుస్తుల్లో నమ్రతా కౌర్ లైట్ గ్రీన్ కలర్ గౌన్ లో దర్శనం ఇచ్చి అలరించారు! వీర్తో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు వోగ్యు బ్యూటీ అవార్డ్స్ 2015ని ఫుల్ గ్లామరస్ గా మార్చేశారు.