కొత్తగా వచ్చిన.. ఏడు ప్రత్యేక దినోత్సవాలు

Sun Aug 09 2015 21:53:47 GMT+0530 (IST)

స్టార్ల వల్ల దేనికైనా ప్రచారం ఇట్టే వచ్చేస్తుంది. అయితే గాంధీ జయంతి ఎయిడ్స్ డే స్వాతంత్య్ర దినోత్సవం సంక్రాంతి ఉగాది దసరా అంటూ వీటికి మాత్రమే మన స్టార్లు ప్రచారం చేస్తున్నారు. వీళ్లు ప్రచారం చేయాల్సిన అందరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన దినోత్సవాలు ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.

నేషనల్ గాళ్ ఫ్రెండ్ డే : ఆగస్టు 1న ఈ ఉత్సవాన్ని ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే ఇది ఇండియాలో కాస్త తక్కువ. గాళ్ ఫ్రెండ్ ఉన్న ప్రబుద్ధులు మాత్రమే ఈ దినోత్సవాన్ని ఆస్వాధిస్తున్నారు. మిగతా వాళ్లకి ఈ దినోత్సవం గురించి అంతగా తెలీదు.

సెల్ఫీ డే : ఏప్రిల్ 7న ఈ దినోత్సవం. ప్రిన్స్ చార్లెస్ అపుడెపుడో ఓ స్కూలు పిల్లాడితో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డేవిడ్ కామెరూన్‌తో సెల్ఫీ దిగారు. ఈ ప్రముఖుల వల్ల సెల్ఫీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఇక నుంచి ఏప్రిల్ 7వ తేదీన అంతా జరుపుకునే పండుగ ఇది.

స్టార్ వార్స్ డే : మే 4న ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది హాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా కాబట్టి ఆ పదం బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు నెట్ లో స్టార్ వార్స్ పేరుతో గేమ్స్ కూడా పిల్లలకి అందుబాటులో ఉన్నాయి.

టోస్ డే : పాదాల ఎక్సర్ సైజ్ డే అన్నమాట. ఆగష్టు 6న ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాదాలకు ప్రత్యేకించి ఎక్సర్ సైజులు చేయించే దినోత్సవం అన్నమాట!

టవల్ డే : మే 25న టవల్ డే జరుపుకుంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ రచయిత ఆడమ్స్ డగ్లస్ వల్ల ఇది పాపులర్ అయ్యింది. ఒక టవల్ తో పుస్తకాల్ని కప్పి మనం అభిమానించే వాళ్లకు ఇచ్చుకుంటే అదో ఆనందం. అందుకే ఈ డే ఆంగ్ల దేశాల్లో పాపులర్ అయ్యింది. మనకి ఇంకా పెద్దగా తెలీనేతెలీదు.

వరల్డ్ క్యాట్ డే : ఆగష్టు 8న ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. పిల్లి గురించి తెలియనిది ఎవరికి. ఇళ్లలో తిరిగే పిల్లి వల్ల మనుషుల్లో ఉండే డిప్రెషన్ తగ్గుతుందని చెబుతుంటారు. అందుకే పిల్లికో డే పాపులర్ అవుతోంది.

మడ్ ప్యాక్డ్ డే: సెప్టెంబర్ 30న ఈ డే జరుపుకుంటున్నారు. ఉత్తరాదిన ఫేమస్. ఇప్పుడిప్పుడే మనకి కూడా పాపులర్ అవుతోంది. బురద ఒళ్లంతా పూసుకుని అది ఆరాక స్నానమాచరిస్తే అది ఆరోగ్యానికి మేలని రుజువైంది.