ముసలోళ్లకు దసరా పండుగ.. పడుచోళ్లకు డబ్బులే అండగా

Mon Aug 10 2015 12:41:30 GMT+0530 (IST)

వినటానికి విచిత్రంగా అనిపించినా ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా బయటకొచ్చింది. డబ్బులుండి వయసు మళ్లిన మగమహారాజులు తమ భాగస్వాములుగా ఎవరిని కోరుకుంటున్నారు? ఇక.. అందంగా ఉంటున్న పడుచు మహిళలు తమ భాగస్వామిగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనం ఆసక్తికరమైన అంశాల్ని బయటపెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నిర్వహించిన ఈ అధ్యయనం విస్మయం రేకెత్తించే వివరాల్ని బయటకు తీసుకొచ్చింది.

అలా అని.. ఈ అధ్యయనం పది.. ఇరవై.. లేదంటే వంద మంది మీద కాకుండా దాదాపుగా 33 దేశాల్లో వేలాది మందిపై నిర్వహించిన అధ్యయనం తేల్చిన వివరాలు అద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బాగా డబ్బులుండి.. వయసు మళ్లిన మగవారు తమ భాగస్వామిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. అందమైన.. నవ యవ్వనవతికే ఓటేస్తున్నారట. అదే సమయంలో.. మహిళలు సైతం ఆసక్తికరంగా వయసు మళ్లినా.. డబ్బులున్న మగమహారాజులకు తమ ఓటు అనేస్తున్నారట.

ఈ అధ్యయనాన్ని 4764 మంది పురుషుల మీద.. 5389 మంది మహిళల మీద నిర్వహించారు. వీరంతా కూడా తమ ప్రాధామ్యాలకు వస్తే.. డబ్బులున్న మగాళ్లే తప్పించి.. వయసు పని లేదని తేల్చేయటం గమనార్హం. చూస్తుంటే.. మగాళ్ల దగ్గర డబ్బులుండాలే కానీ.. అందమైన.. నవ యవ్వనవతులు డేటింగ్ కి సై అంటున్నారన్న మాట. చూస్తుంటే ముసలోళ్లకు దసరా పండగా.. పడుచోళ్లకు డబ్బే అండగా ఉంది తప్పించి.. మరొకటి కనిపించటం లేదే.