సెక్స్ వరకూ వద్దు.. బెడ్ ను పంచుకొంటే చాలు!

Thu Jul 23 2015 11:57:37 GMT+0530 (IST)

దంపతుల మధ్య అనుబంధం పెరగడంలో సెక్స్ ది గొప్ప పాత్ర అని వేరే చెప్పనక్కర్లేదు. దాంపత్యంలోని ప్రేమను అనుభూతిగా మార్చుకోవడానికి నిదర్శనం సెక్స్. శృంగారాన్ని కేవలం శారీరక కోరిక మాత్రమేగా చూడలేం. ప్రేమ వ్యక్తీకరణలో అది అల్టిమేట్. మరి భార్యాభర్తల అనుబంధంలో సెక్స్ ది కీలకపాత్రే అయినా.. బంధం ధృడంగాఉండాలంటే.. బంధంలోని అనుభూతి అర్థం కావలంటే సెక్సే పరమావధి కానక్కర్లేదని అంటున్నారు మానసిక శాస్త్ర పరిశోధకులు.బెడ్ ను పంచుకొంటే చాలు.. బంధం లోని అనుభూతి అర్థం అవుతుందనేది వారి మాట. భార్యభర్తలు ఒకే మంచం మీద పడుకొంటే చాలు ఆరోగ్యం పెరుగుతుంది.. అనోన్యత కలుగుతుంది అంటున్నారు. ప్రతి రాత్రీ సెక్స్ లో పాల్గొనక్కర్లేదు.. ఒకరికొకరు దగ్గరగా ఉన్నా చాలా ఆ భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.. అని విశ్లేషిస్తున్నారు. అది తెలియకుండా వచ్చే భద్రత.. ఎటువంటి ఒత్తిడిని అయినా దూరం చేసే భద్రత. ఆభద్రత మంచి నిద్రను ఇస్తుంది.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.

వివాహానికి ముందు ఒంటరిగా పడుకోవడం అలవాటే. కానీ పెళ్లి అయిన తర్వాత జంటగా పడుకోవడం అలవాటు అయ్యాకా.. ఎప్పుడైన ఒంటరిగా పడుకోవాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని.. పక్కన తోడు లేకుంటే ఆ ప్రభావం నిద్రపై కూడా పడుతుందని వారు బెడ్ ను పంచుకోవడంలో ఉండే ప్రభావం గురించి వివరించారు. బెడ్ ను పంచుకోవడంలో ఉంటే ప్రభావం అంది అని విడమరిచి చెప్పారు.