సినిమావాళ్ళ ఫోన్స్ పిచ్చి కి బ్రేక్

Tue Aug 04 2015 09:14:56 GMT+0530 (IST)

సినిమా స్టార్ అయినా సీరియల్స్ లో యాక్టర్ అయినా కూడా.. ఆ సెలబ్రిటీ స్టేటస్ చూపించాలంటే మాత్రం మనోళ్ళు ఒక రేంజ్ చూపించాల్సిందే. బాగా డబ్బులు సంపాదిస్తున్న సెలేబ్స్ అయితే రేంజ్ రోవర్ కొని చూపిస్తారు మోస్తరుగా సంపాదించే బాబులైతే మినిమం మారుతీ 800 అయినా కొంటారు. ఇక కార్లతోపాటు సెల్ ఫోన్ కూడా చాలా ముఖ్యం. మాక్సిమం అందరూ మొన్నటివరకు ఐ-ఫోన్ లేటెస్ట్ మోడల్ ఫోన్ మాత్రమే కొనేవారు. ఇక సెకండ్ మొబైల్ వుంటే మాత్రం కచ్చితంగా అది బ్లాకు బెర్రీయే. బట్ ఈ పిచ్చికి ఇప్పుడు బ్రేక్ పడింది.

నిజానికి మొన్నటివరకు ఎవరి దగ్గర ఐ-ఫోన్ వుంటే వాళ్ళు కింగ్ అన్నట్లు వుండేది. కాని ఈ ఇ-కామర్స్ సైట్స్ పుణ్యమా అని ఇప్పుడు ఏ ఫోన్ అయిన ఈజీగా కొనుక్కునే ఛాన్స్ దొరికేసింది. 20 వేల రూపాయల జాబ్ చేసే ఎంప్లాయ్ అయినా కూడా ఇప్పుడు వాయిదాల పద్దతిలో హ్యాపీగా కావాల్సిన ఫోన్ కొనుక్కోవచ్చు. రెండు సంవత్సరాల ఇ.యం.ఐ  పద్దతిలో చక్కగా లేటెస్ట్ ఐ పోనే కొనుక్కుంటే నెలకి ఒక 2-3 వేలు కడితే చాలు. అందుకే ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన ఆ ఫోన్లే కనిపిస్తున్నాయి. సో సినిమా వాళ్ళ దగ్గరే కాస్త ఖరీదైన ఫోన్లు ఉంటాయి అనే అపోహ తొలిగిపోయింది. అందుకే మనోళ్ళు కూడా పనికి పనికొచ్చే ఫోన్స్ కొనుక్కుంటున్నారు తప్పించి ఎక్స్ట్రా కాస్ట్ ఉన్న ఫోన్స్ జోలికి వెళ్ళట్లేదు. అది సంగతి.