సహజీవనంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!

Fri Jul 24 2015 09:22:30 GMT+0530 (IST)

ఒకప్పుడు ప్రేమపెళ్లి అంటే అదో విచిత్రమైన విషయం! దానికోసం పోరాటాలు చేయాలి యుద్దాలు జరగాలి...  అప్పుడైనా జరుగుతుందనే గ్యారెంటీ లేదు! తర్వాత కాలంలో అడపాదడపా లవ్ మ్యారేజ్ లు జరగడంతో అవికాస్తా బాగానే అలవాటైపోయాయి ప్రపంచానికి.. ముఖ్యంగా భారతీయ సంస్కృతికి! అయితే తాజాగా... సహజీవనం అనే కొత్త ట్రెండ్ మెల్లమెల్లాగా వ్యాప్తిచెందుతుంది. ఈ విషయంలో ముఖ్యంగా చాలామంది ఆడపిల్లల తల్లితండ్రులు నిద్రలేకుండా ఉంటున్నారనే చెప్పాలి!ఒకరినొకరు ఇష్టపడ్డ ఇద్దరు యువతీ యువకులు ఒకప్పుడు ప్రేమించుకుని మాత్రం ఆగితే... అది కాస్త ఇప్పుడు కలిసి ఒకే ఇంట్లో అనఫీషియల్ భార్యభర్తలుగా నివసిస్తుంటారు. తర్వాతి పరిణామాలు ఎవరి అవగాహనమేరకు ఎవరి అదృష్టం మేరకు అలా జరుగుతుంటుంది! అయితే తాజాగా ఈ విధానంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది! ప్రస్తుతం ఆధునిక సమాజంలో సహజీవనం అందరికీ ఆమోదయోగ్యం అయ్యిందని దానివల్ల అది నేరం కాదని జస్టీస్ దీపర్ మిశ్రా జస్టీస్ ప్రపుల్ల సి. పంత్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది!

ప్రజాజీవితంలో ఉన్నవారి సహజీవనాన్ని బయటపెట్టడం అనే విషయం పరువునష్టం కిందకు వస్తుందా అని ప్రభుత్వాన్ని అడిగే సందర్భంళో ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం! ఇదేసమయంలో ప్రజాజీవితంలో ఉన్నంతమాత్రాన్న... వారి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడకూడదని దానివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపింది!