అమ్మాయిలు అస్సలు సిగ్గు పడటం లేదట

Sun Jul 26 2015 15:14:38 GMT+0530 (IST)

సెక్స్ అనే మాట వినిపిస్తే చాలు.. మగాళ్లు సైతం పక్కన బాంబు పడినట్లుగా అదిరిపోయే బిత్తర చూపులు చూసే వారు. అలాంటి దేశంలో ఆడోళ్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. అయితే.. ఇదంతా ఓ రెండు దశాబ్దాల కిందటి మాట.

కాలంతో పాటు.. అభిప్రాయాలు.. అలవాట్లు బాగానే మారిపోయాయి. ఒకప్పుడు భారతదేశంలో మగాడు సైతం బిడియంగా మాట్లాడే సెక్స్ గురించి.. ఇప్పటి అమ్మాయిలు ఎలాంటి మొహమాటానికిగురి కావటం లేదట. చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారట. గతంలో మాదిరి మెలికలు తిరిగిపోవటం.. సిగ్గుతో కందిపోవటం.. బిడియపడటం లాంటివి తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు.

ప్రేమికుల దగ్గర నుంచి భార్యభర్తల మధ్య వరకూ అమ్మాయిల్లో మార్పు చాలా స్పష్టంగా వచ్చేసిందంట. ఈ విషయాన్ని పలువురు సెక్సాలజిస్ట్ లు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు.

గతంలో అమ్మాయిలు మహా తొందరపడితే కౌగిలింతలు.. ముద్దుల వరకు మాత్రమే వెళ్లేవారని.. ఇప్పడు మాత్రం అంతకు మించి అడ్వాన్స్ అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వాత్సా ఈ అంశం మీద మాట్లాడుతూ.. రోజులు బాగా మారిపోయాయని.. గతంలో అబ్బాయిలు సెక్స్ ను ఎంజాయ్ చేస్తే.. అమ్మాయిలు బిడియపడేవాళ్లని కానీ.. ఇప్పుడు మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మారిన జీవనశైలితో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతోందని.. ఈ వైఖరి అబ్బాయి..అమ్మాయిలు ఇద్దరిలోనూ కనిపిస్తుందని చెబుతున్నారు.