నిద్రకు ముందు తినాల్సినవి.. తినకూడనవి ఇవీ..!

Sun Jul 19 2015 14:05:52 GMT+0530 (IST)

మనం తీసుకొనే ఆహారంలో నిద్రను ప్రభావితం చేసేవి కూడా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. నయా జీవనశైలిలో అయితే వీటి ప్రభావం మరింత ఎక్కువ. శారీరక శ్రమ చేసే గ్రామీణులకు మరో అంశంతో పట్టింపు లేకుండా సమయానికి నిద్ర పడుతుంది. అయితే నగర జీవనశైలిలో ఎంత పని చేసినా.. అది శారీరక శ్రమ కిందకు రాదు. వ్యాయమాలు చేసే తీరిక ఉన్నవారికి సుఖ నిద్ర పడుతుంది. అయితే ఆ అవకాశం లేని వారు మాత్రం నిద్ర విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో నిద్రను ప్రభావితం చేసే ఆహారం గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

నిద్రకు ముందు ఈ పదార్థాలు తీసుకోవద్దు...

కెఫైన్ ను కలిగిన పదార్థాలు ఆల్కాహాల్. సోడా మిల్క్ చాక్లెట్ ఎనర్జీడ్రింక్ బర్గర్లు కూల్ డ్రింకులు.. వీటన్నింటిలోనూ నిద్రకు భంగం కలిగించే లక్షణాలు ఉంటాయి. మెదడుపై ప్రభావితం చూస్తే ఇవి నిద్రపట్టకుండా చేయడం.. నిద్రను గాఢతకు తీసుకెళ్లకుండా చేయడం చేస్తాయి. కాబట్టి రాత్రిపూట సుఖనిద్ర కావాలనుకొనే వారు వీటిని దూరంగా ఉంచడమే మంచిది.

ఇవి తినండి...

నిద్రకు ముందు ఎక్కువ నీళ్లు కూడా తాగకూడదు. అలా నీళ్లు తాగడం వల్ల బాత్ రూమ్ కు వెళ్లాల్సి వచ్చి నిద్రకు భంగం కలగగలదు అంటారు వైద్యులు. మరి నిద్రకు ముందు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటంటే...పాలు తేనెలు మంచివి. రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చనిపాలు తాగితే చక్కటి నిద్ర పడుతుంది. తేనెలో కూడా నిద్రను కలిగించే స్వభావం ఉంటుంది. ఓట్ మీల్ బ్రెడ్ బాదాం చెర్రీలు అరటిపండు.. ఈ పదార్థాలు సుఖనిద్రను కలిగిస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు. నిద్రకు ముందు డైట్ ను వీటిని అనుసరించి ప్లాన్ చేసుకోండి మరి.