రెగ్యులర్ ఫ్లైట్ జర్నీస్ అయితే జర జాగ్రత్త

Fri Aug 07 2015 15:11:08 GMT+0530 (IST)

తరచూ విమానప్రయాణాలు చేయటం మంచిదేనా? బడా బడా ప్రారిశ్రామికవేత్తల నుంచి సెలబ్రిటీలు.. సంపన్నులు తరచూ విమాన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. వీరే కాదు.. ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా విమాన ప్రయాణాలే ఎక్కువ. వారి సమయం విలువైనది కావటం.. బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో.. వారెక్కువగా విమాన ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు.అయితే.. తరచూ విమాన ప్రయాణాలు చేయటం ఏ మాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. విమాన ప్రయాణాలు తరచూ చేసే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజాగా తరచూ విమాన ప్రయాణం చేసే వారి మీద ఒక అధ్యయనం చేపట్టారు.

దీనికి సంబంధించి వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగానే కాదు.. ఆందోళన కలిగేంచేలా ఉండటం గమనార్హం. ఈ అధ్యయనాన్ని బ్రిటన్ కు చెందిన సర్రే వర్సిటీ.. స్వీడన్ కు చెందిన లండ్ విశ్వవిద్యాలయం చేపట్టారు. తరచూ విమాన ప్రయాణాలు చేసే వారు రేడియేషన్ ప్రభావానికి గురి అవుతారని.. వారంతా పలు జీవనశైలి వ్యాధుల బారిన పడే వీలుందని చెబుతున్నారు.

రేడియేషన్ ప్రభావంతో పాటు.. ఒత్తిడి.. ఒంటరితనం.. జెట్ ల్యాగ్ తదితర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. తరచూ విమాన ప్రయాణాలు చేసే వారు.. అందరితో కలుపుగోలుగా ఉండటానికి అస్సలు ఇష్టపడరని.. వారిదైన లోకంలో విహరిస్తూ.. వారిదైన లోకంలో విహరించటానికే ఎక్కువ ఇష్టపడతారని చెబుతున్నారు. సో.. రెగ్యులర్ ఫ్లైట్ జర్నీ చేసే వారంతా కాస్త పారాహుషార్ సుమా.