బ్రిస్క్ వాక్ తో బెనిఫిట్స్ ఎన్నో..!

Tue Jul 21 2015 12:16:10 GMT+0530 (IST)

నడక.. కాస్త వేగంగా. అది కూడా ఉదయం లేదా సాయంత్రం.. ప్రశాంతమైన వాతావరణం మధ్య.. ఇంతకు మించి శరీరానికి వేరే వ్యాయమం ఉండదు. బ్రిస్క్ వాక్ తో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. వైద్యశాస్త్రం కూడా ధ్రువీకరించిన ప్రయోజనాలు ఇవి. నడకవల్ల కలిగే ప్రయోజనాలను పదే పదే చెప్పుకొన్న కూడా త్పులేదు. బ్రిస్క్ వాక్ తో అయితే ప్రయోజనాలు మరింత ఎక్కువ. ఇలా నడవడం వల్ల రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది.

డయాబెటిస్ కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకోవడంలోనూ బ్రిస్క్ వాక్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. రోజూ ఇలా నడవడం వల్ల కండర ఎముక పుష్టిపెరుగుతుంది. అలాగే నడకతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ రోజుల్లో ఒత్తిడి అనే విషయం ఎరగని వారు ఎవరూ ఉండరు. ఏదో ఒక సమస్య తాలూకు ఒత్తిడి ఎటువంటి వారికైనా తప్పదు. మరి వాకింగ్ తో ఆ సమస్యను కూడా నివారించుకోవచ్చు. ప్రతి రోజూ కొన్ని నిమిషాలు అయినా నడకను అలవాటు చేసుకోవాలి. దీని వల్ల కచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి.

నడకవల్ల శరీరానికి గొప్ప వ్యాయాయం లభిస్తుంది. దీని వల్ల అధిక కొవ్వు తగ్గిపోతుంది. నడుం చుట్టూరా టైర్లలా పెరిగిన కండ తగ్గుతుంది. చక్కటి శరీరాకృతి సొంతం అవుతుంది. మరి శరీరాకృతి ఇచ్చే ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే నడకవల్ల శృంగార భావనలు కూడా పెరుగుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం వేళ నడవడం వల్ల శృంగార సంబంధిత హార్మోన్లు ఉత్తేజితం అవుతాయని ఈ అధ్యయనం వివరిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నడకతో.. నడవండి మరి!