Begin typing your search above and press return to search.

రూపాయితో విమాన ప్రయాణం

By:  Tupaki Desk   |   22 April 2015 4:31 AM GMT
రూపాయితో విమాన ప్రయాణం
X
విమాన ప్రయాణం సగటు జీవికి అందని కల అని గమనించి విమానయాన కంపెనీలు ప్రవేశపెట్టే పథకాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మన ఆసక్తులను గమనించినట్లే ఉండటంతో పాటు మన బడ్జెట్ కు తగ్గట్లు కూడా సదరు ప్లాన్లు ఖరారు చేస్తుంటాయి. విమాన కంపెనీల మధ్య పోటీ పెరిగినపుడు, విమాన ఇంధనం ధరలు తగ్గినపుడు ఇలాంటి ఆశ్చర్యకర ఆఫర్లు ఎక్కువగా వస్తుంటాయి. విదేశీ సంస్థలు ఈ జోరును మరింత పెంచుతున్నాయి.

అత్యంత చవక విమానయానానికి శ్రీకారం చుట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ చవక ధరల మార్కెట్ ను తన కొత్త ప్లాన్ తో హీటెక్కిస్తోంది. ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త ఆఫర్ తో ఆటోల కంటే కారు చవగ్గా... కిలోమీటరుకు కేవలం ఒక్క రూపాయి చార్జీతోనే విమానం ఎక్కవచ్చంట. ఈ మేరకు ఆ కంపెనీ చెబుతోంది. ఎయిర్ ఏషియా సంస్థ తమ నెట్ వర్క్ లోకి ఢిల్లీని కొత్తగా చేర్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీకి బెంగళూరు, గువాహటి, గోవాలతో ఆ సంస్థకు కనెక్టివిటీ వచ్చింది. తాజా స్కీము కోసం ప్రత్యేకంగా పరిమిత కాలానికి ఈ ఆఫర్ పెట్టింది.

కిలోమీటరుకు ఒక్క రూపాయి చార్జీ ఆఫర్ తో ఈనెల 26 వరకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మే 21 నుంచి పైన పేర్కొన్న మార్గాల్లో ఎయిర్ ఏషియా విమానాలు తిరుగుతాయి. ఢిల్లీ-గువాహటి మధ్య అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1500, ఢిల్లీ-గోవా, ఢిల్లీ-బెంగళూరు మార్గాలకు రూ. 1700గా టికెట్ ధరలు నిర్ణయించారు. మే 21 నుంచి మే 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో..గెట్ రెడీ టు ఏ ట్రిప్