Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీపై అనర్హత వేటు వ్యవహారం... తెరపైకి కీలక అప్ డేట్!

13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో రెండో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 10:23 AM GMT
ప్రధాని మోడీపై అనర్హత వేటు  వ్యవహారం... తెరపైకి కీలక అప్  డేట్!
X

13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల్లో రెండో దశ లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో... రెండో విడతలో బిహార్, ఛత్తీస్‌ గఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌ లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది. మరోపక్క బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ఇండియా కూటమి కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. పైగా ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించింది కావడంతో మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే... ప్రధాని మోడీకి సంబంధించి అనర్హత పిటిషన్ దాఖలయ్యింది.. దీనిపై విచారణ తేదీ ఫిక్సయ్యింది.

అవును... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్ ను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అయితే... నేడు ఈ పిటీషన్ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. దీంతో... ఈ నెల 29వ తేదీ (సోమవారం) ఈ పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుందని తెలుస్తుంది. దీంతో... సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది.

వాస్తవాన్నికి ఈరోజే ఈ పిటిషన్ పై విచారణ జరగవలసి ఉన్నప్పటికీ... ఈ పిటీషన్‌ ను విచారించాల్సిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా విధులకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయన సెలవులపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నాడు విధులకు హాజరు కానున్నారని.. ప్రధాని మోదీ అనర్హత పిటీషన్‌ పై ఆరోజు ఆయన విచారణ చేస్తారని చెబుతున్నారు!

లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా... దేవుళ్లు, మతాల పేర్లను విస్తృతంగా వినియోగిస్తోన్నారనే ఆరోపణలను ప్రధాని మోడీ ఎదుర్కొంటోన్నారు. హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా ప్రజలు కోల్పోయారంటూ కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో మోడీ పేర్కొన్నారు. ఇదే క్రమంలో... ఉత్తరప్రదేశ్‌ లోని ఫిలిభిత్‌ లోని ఎన్నికల ప్రచార సభలో దేవుళ్లు - దేవాలయాలు, హిందువులు - హిందూమతం పేర్లతో మోడీ ఎన్నికల్లో ప్రచారం చేశారని పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది!