Begin typing your search above and press return to search.

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట సంచలన వ్యాఖ్యలు!

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2024 7:54 AM GMT
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట సంచలన వ్యాఖ్యలు!
X

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. వైసీపీ నుంచి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మాగుంట ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల వైసీపీకి మాగుంట రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో మాగుంట టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఆయన అధికారికంగా చేరలేదు. ఎట్టకేలకు మాగుంట శ్రీనివాసులరెడ్డే స్వయంగా తాను రెండు రోజుల్లో టీడీపీలో చేరుతున్నానని ప్రకటించడంతో ఈ వార్తలకు పుల్‌ స్టాప్‌ పడింది.

టీడీపీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని తెలిపారు. ఏ రోజు టీడీపీలో చేరాలో చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. అయితే తనకు బదులుగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరానని వెల్లడించారు. ప్రజలు కూడా మాగుంట రాఘవరెడ్డిని ఆశీర్వదించాలని విన్నవిస్తున్నానన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక అద్భుతమని మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. కూటమి విజయవంతమవుతుందని చెప్పారు. మూడు పార్టీల నాయకులం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు మాగుంట ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలను తన ఇంట అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో

డీడీపీ మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బీఎన్‌ విజయ్‌ కుమార్, అశోక్‌ రెడ్డి, యర్రగొండపాలెం ఇంచార్జి ఎరిక్షన్‌ బాబు, దర్శి ఇంచార్జి రవికుమార్‌ మాగుంట ఇంట్లో భేటీ ఆయ్యారు.

త్వరలో టీడీపీలో చేరతానని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని టీడీపీ నేతలతో చెప్పారు. తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పానన్నారు.

కాగా మరోవైపు ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీగా ప్రస్తుతం చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. చెవిరెడ్డి.. జగన్‌ కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెవిరెడ్డిపై మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయనున్నారు.