Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ పేరు మార్చడానికి సిద్ధమేనా?

బీఆర్ఎస్ పార్టీకి ఆ పేరే నష్టం తీసుకొస్తుందని చెబుతున్నారు. పేరు మార్పుతోనే అధికారానికి దూరమైనట్లు కొందరు పండితులు కూడా చెప్పారు.

By:  Tupaki Desk   |   6 April 2024 9:08 AM GMT
బీఆర్ఎస్ పేరు మార్చడానికి సిద్ధమేనా?
X

బీఆర్ఎస్ పార్టీకి ఆ పేరే నష్టం తీసుకొస్తుందని చెబుతున్నారు. పేరు మార్పుతోనే అధికారానికి దూరమైనట్లు కొందరు పండితులు కూడా చెప్పారు. కానీ అధినేత కేసీఆర్ ఆ మాటలను పట్టించుకోలేదు. ఫలితంగా నష్టం చవిచూశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చకపోతే ఇంకా అధ్వాన ఫలితాలు వస్తాయని అంటున్నారు. దీంతో దిద్దుబాట చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అవసరమైతే జైలుకైనా వెళతాను కానీ పార్టీ మారను అంటున్నారు. జీవితాంతం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ భయపెడుతున్నారని పేర్కొంటున్నారు.

గతంలో రైతుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను. పోలీసులతో దెబ్బలు తిన్నాను. ఇప్పుడు కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. అంతేకాని ఎవరికి భయపడనని స్పష్టం చేశారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతోంది. అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ప్లాన్లు చేస్తోంది. దీంతో దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొనడం విశేషం.

బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు. పార్టీ పేరు మార్చడంతోనే ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తించాం. అందుకే పార్టీ పేనును మార్చాలని భావిస్తున్నాం. దీని వల్ల పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు. ఇలా పార్టీ పేరును మార్చి తమ పార్టీ ఉనికిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ వైపు పార్టీ ఎమ్మెల్యేల వలసలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.