Begin typing your search above and press return to search.

ప్రచారానికి మెగా హీరోలు దూరం జరిగారా.. పెట్టారా..?

ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఆయన తరుపున ప్రచారానికి మెగా ఫ్యామిలీ హీరోలు యాక్టివ్ గా, అవైలబుల్ గా ఉంటారని చాలామంది భావించారు కూడా. అయితే ఆ దృశ్యం ఎక్కడా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   26 April 2024 5:03 AM GMT
ప్రచారానికి మెగా హీరోలు దూరం  జరిగారా.. పెట్టారా..?
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఎటు చూసినా రాజకీయ పార్టీల ప్రచార రధాలు, వాటిలో పాటలు, డప్పుల మోత, పార్టీల జెండాల రెపరెపలు.. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా రాజకీయాల గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్ల టాపిక్ తెరపైకి వచ్చింది. తదనుగుణంగా మెగా హీరోల ప్రస్థావనపై ఇప్పుడు చర్చ మొదలైంది!

అవును... ఏపీలో ఎన్నికలు ఇప్పుడు అత్యంత పీక్స్ కి చేరుకుంటున్నాయి. ప్రధానంగా జనసేన, పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి ఈ ఎన్నికలు చాలా కీలకమని.. ఇంకా గట్టిగా మాట్లాడితే... పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేవని అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా అంతే సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగానే ముందుకు కదులుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ తన అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా... ఇతర జనసేన నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాల్సిన నైతిక బాధ్యతను కలిగి ఉన్నారనేది తెలిసిన విషయమే! ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఆయన తరుపున ప్రచారానికి మెగా ఫ్యామిలీ హీరోలు యాక్టివ్ గా, అవైలబుల్ గా ఉంటారని చాలామంది భావించారు కూడా. అయితే ఆ దృశ్యం ఎక్కడా కనిపించడం లేదు.

మరోపక్క.. జబర్ధస్త్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్, నటుడు ఫృథ్వీ రాజ్, జానీ మాస్టర్ లు మాత్రం ప్రచారం చేస్తున్నారు. అయితే... ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వీరి ప్రచారం మాత్రమే సరిపోదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క జనసేన కీలక నేత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో చాలామంది హీరోలే ఉన్నారు. రాం చారణ్ రాకపోయినా.. ఇంకా చాలా మందే ఉన్న పరిస్థితి!

మరి వారెందుకు రాలేదు. పిఠాపురంలో చిరంజీవి ప్రచారం ఉంటుందని ప్రచారం జరుగుతున్నా.. అది ప్రస్తుతానికి కేవలం ప్రచారం మాత్రమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన హీరోలు రాకపోవడాన్నికి గల కారణాన్ని పలువురు భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా... వారి వారి సినిమా కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు కావాలనే దూరంగా ఉంచారని చెబుతున్నారు.

మరి జానీ మాస్టర్, ఫృథ్వీ రాజ్, ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ల పరిస్థితి? అనే ప్రశ్న ఆటో మెటిక్ గా తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా... పిఠాపురంలో ఆశించిన స్థాయిలో మెగా హీరోల సందడి అయితే లేదని మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది. ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయంట! మరోపక్క మెగా ఫ్యాన్స్ మద్దతుకు సంబంధించి ఆ సంఘ నాయకుడు స్వామి నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు!!