Begin typing your search above and press return to search.

రిలాక్స్ టైమ్ : నేతాశ్రీలు విమానమెక్కి చెక్కేయడమే !

ఇక వైసీపీ మంత్రులు కీలక నేతలతో పాటు టీడీపీ సీనియర్లు మాజీ మంత్రులు సహా ఏపీలో ఇప్పటిదాకా రాజకీయంగా అలసి సొలసిగా వారంతా రిలాక్స్ అయ్యేందుకు విమానమెక్కి చలో అంటారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 May 2024 2:35 PM GMT
రిలాక్స్ టైమ్ :   నేతాశ్రీలు విమానమెక్కి చెక్కేయడమే !
X

బాబోయ్ ఎండలు అని ఒక వైపు చికాకు. అలాంటి ఎండలలో వచ్చి పడిన ఎన్నికలు. హాయిగా ఏసీ గదులలో గడిపే నేతాశ్రీలు మండుటెండల్లో రోడ్ల మీదకు వచ్చారు. ఓటు కోసం జనం ముంగిట నిలిచారు. ఏపీలో చూస్తే ఈసారి దాదాపుగా రెండు నెలల బిజీ షెడ్యూల్ గా ఎన్నికలు ఉన్నాయి. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మే 13న పోలింగ్ జరుగుతోంది. అంటే బిగిసి రెండు నెలల సమయం అన్న మాట.

ఇంత సుదీర్ఘమైన టైమ్ లో ఎండలలో ఎండుతూ మాడుతూ ప్రచార రధాలు ఎక్కి మరీ చెమటలు కక్కారు. ఓటు కోసం జనం తోనే ఉంటూ వచ్చారు. ఇంకా చూస్తే మరో అయిదు రోజులలో ఏపీలో పోలింగ్ పూర్తి అవుతుంది. ఒక ఓటు ఎంపీకి మరో ఓటు ఎమ్మెల్యేకి వేస్తూ జనాలు తమదైన తీర్పు ఇవ్వనున్నారు.

ఏపీలో రెండు మూడు నెలల నుంచి హెవీ గా ప్రచారం చేస్తూ జనంలో ఉంటూ వస్తున్న నేతలకు అధినేతలకు మే 13 తరువాత ఫుల్ రిలాక్స్ మూడ్ అని అంటున్నారు. ఎందుకంటే కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. అంటే అప్పటికి ఏకంగా 22 రోజులు టైమ్ ఉంది. ఇంత సుదీర్ఘమైన టైమ్ ఉండడంతో అంతా చలో చలో అంటున్నారు.

ఎవరికి వారుగా విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ అయితే ఈ నెల 17 నుంచి ఈ నెల 30 వరకూ ఏకంగా రెండు వారాలకు పైగా విదేశాలకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన లండన్ కి వెళ్తారు అని అంటున్నారు. అక్కడ ఆయన కుమార్తెలు ఇద్దరూ ఉన్నారు. దాంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా అక్కడికి అప్పటికే చేరుకుంటారు అని అంటున్నారు.

అంతా కలసి లండన్ లో ఫుల్ హ్యాపీ మూడ్ లో టైమ్ స్పెండ్ చేస్తారు అని అంటున్నారు. పూర్తిగా ఎన్నికల అలసట, రాజకీయాల బిజీని ఆ ఇబ్బందులను మరచిపోయి రెస్ట్ తీసుకుంటారు అని అంటున్నారు. ఈ మేరకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు విదేశీ పర్యటన చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈసారి భారీ ట్రిప్ ప్లాన్ చేశారు అని అంటున్నారు. గతసారి ఆయన దేశంలోనే వేరే చోటకు వెళ్ళారు. ఈసారి ఆయన విదేశాలకు వెళ్ళే ప్లాన్ ఉందని అంటున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ సైతం విదేశీ ట్రిప్ ని ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

ఇక వైసీపీ మంత్రులు కీలక నేతలతో పాటు టీడీపీ సీనియర్లు మాజీ మంత్రులు సహా ఏపీలో ఇప్పటిదాకా రాజకీయంగా అలసి సొలసిగా వారంతా రిలాక్స్ అయ్యేందుకు విమానమెక్కి చలో అంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో మే 13 తరువాత అంతా గప్ చిప్ గానే ఉంటుంది. మళ్లీ జూన్ 1 న చివరి విడత ఎన్నికల ఫలితాల తరువాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ తోనే రాజకీయ సందడి మొదలవుతుంది అని అంటున్నారు. అప్పటికి అంతా తిరిగి ఏపీకి చేరుకుంటారు అని అంటున్నారు.