Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీకి రిచ్చెస్ట్ ఉమన్ రాజీనామా... ఈమె ఆస్తులెన్నో తెలుసా?

ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత నవీన్ జిందాల్ పార్టీని వీడి బీజేపీలో చేరగా.. ఇప్పుడు ఆయా తల్లి కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   28 March 2024 2:30 PM GMT
కాంగ్రెస్  పార్టీకి రిచ్చెస్ట్  ఉమన్  రాజీనామా...  ఈమె ఆస్తులెన్నో తెలుసా?
X

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తుండగా.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి నిలవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తపిస్తుంది! ఈ సమయంలో... కాంగ్రెస్ పార్టీ గ్యాప్ లేకుండా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత నవీన్ జిందాల్ పార్టీని వీడి బీజేపీలో చేరగా.. ఇప్పుడు ఆయా తల్లి కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... ఇటీవల కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ ఆ పార్టీని వీడి, భారతీయ జనతాపార్టీలో చేరగా.. ఇప్పుడు అతని తల్లి సావిత్రీ జిందాల్ కూడా కాంగ్రెస్స్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగగా.. సావిత్రీ జిందాల్ ఏ పార్టీలో చేరబోతున్నారు.. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది ఇంకా వెల్లడికాలేదు!

కాగా... దేశంలోని అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ పేరొందిన సంగతి తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సావిత్రి జిందాల్ వయసు 84 ఏళ్లు కాగా.. జిందాల్ గ్రూప్ వ్యాపార వ్యవహారాలను ఆమె నిర్వహిస్తున్నారు.

ఇక ఇటీవల బ్లూమ్‌ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వివరాల ప్రకారం... 28 మార్చి 2024 నాటికి సావిత్రి జిందాల్ నికర ఆస్తుల విలువ 29.6 బిలియన్ డాలర్లు! అంటే... భారత కరెన్సీలో సుమారు రూ.2.47 లక్షల కోట్లన్నమాట. భారత్ లోని రిచ్చెస్ట్ ఉమన్స్ జాబితాలో ఈమె ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ప్రపంచ జాబితాలో ఈమె స్థానం 56!

జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు, సావిత్రి జిందాల్ భర్త, ఓపీ జిందాల్.. 2005లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో.. ఆయన మరణానంతరం ఆమె వ్యాపార బాధ్యతలు చేపట్టారు. తర్వాత హింసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలో 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఈ క్రమంలో తాజాగా ఆమె పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.