Begin typing your search above and press return to search.

తిరుపతిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ... డేట్ ఫిక్స్!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ.

By:  Tupaki Desk   |   16 Feb 2024 10:48 AM GMT
తిరుపతిలో  రేవంత్  రెడ్డి బహిరంగ సభ... డేట్  ఫిక్స్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ మనుగడ కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న సంగతి తెలిసిందే! కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో సౌత్ లో మరోసారి ఓ వెలుగు వెలగాలని భావిస్తుంది! ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రేవంత్ రెడ్డితోనూ ఒక సభ ఏర్పాటు చేయాలని భావిస్తుంది!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఏపీలో మేనిఫెస్టోని ప్రకటించి.. ఇకపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని బరిలోకి దించుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ నెల ఇరవై ఐదో తేదీన తిరుపతిలో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని సమాచారం.

ఏపీ ఎన్నికల శంఖారావం ఈ సభనుంచే మొదలుపెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్స్ పార్టీ... అదే సభలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సభకు ముఖ్య అతిధులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఈ సభను ఏపీ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.

వాస్తవానికి అంతకంటే ముందే ఈ సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... ప్రస్తుతం షర్మిళ తన కుమారుడి వివాహా వేడుకల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ నెల 18వ తేదీ వరకూ ఆమె పెళ్లి పనుల్లో బిజీగా ఉండనున్నారు. అనంతరం అన్ని పనులూ చక్కబెట్టుకుని కాస్త వీలుచేసుకోవడానికి సమయం ఇచ్చినట్లు కూడా ఉంటాదనే ఉద్దేశ్యంతో ఈ నెల 25ని ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు.

రేవంత్ రెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజే ఉన్నప్పటికీ... ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనను ఏపీలో ఏమేరకు రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్నే! పైగా... ఏపీలో వైసీపీ, టీడీపీలకు ఒకే గాటికి కట్టి విమర్శలు చేయగలిగితేనే కాంగ్రెస్ కు మనుగడ ఉంటుంది తప్ప... బాబుని తమలపాకుతో, జగన్ ని తలుపుచెక్కతో కొడితే కలిగే ప్రయోజనం "నోటా" అని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా... కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సభ ఏ రేంజ్ లో జరగబోతుందనేది వేచి చూడాలి!