Begin typing your search above and press return to search.

చిక్కుల్లో మంత్రి పొంగులేటి కుమారుడు.. స్మ‌గుల్డ్ వాచీల కేసు!

దీంతో ఇప్పుడు మంత్రి పొంగులేటి త‌న‌యు డు హ‌ర్షారెడ్డి చుట్టూ.. వివాదం ముదిరిన‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 April 2024 2:53 AM GMT
చిక్కుల్లో మంత్రి పొంగులేటి కుమారుడు.. స్మ‌గుల్డ్ వాచీల కేసు!
X

తెలంగాణ మంత్రి, ఖ‌మ్మం జిల్లా నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ముద్దుల త‌న‌యుడు చిక్కు ల్లో ఇరుక్కున్నారు. రూ. కోట్ల విలువైన వాచీలను ఇత‌ర దేశాల నుంచి దొడ్డిదారిలో తెప్పించిన నేరం కింద ఆయ‌న‌ మీద ప్రధాన ఆరోపణ . అయితే.. ఇది గ‌త నెల‌లోనే వెలుగు చూసినా.. ఆల‌స్యంగా తెర‌మీదికి రావ‌డం, మీడియాకు వెల్ల‌డికావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు మంత్రి పొంగులేటి త‌న‌యు డు హ‌ర్షారెడ్డి చుట్టూ.. వివాదం ముదిరిన‌ట్టు తెలుస్తోంది.

ఖ‌రీదైన వాచీల వ్య‌వ‌హారం.. వివాదాలు.. నాయ‌కుల‌కు కొత్త కాదు. గ‌తంలో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రా మ‌య్య చుట్టూ కూడా 70 ల‌క్ష‌ల రూపాయ‌ల వాచీ వివాదం రేపింది. అయితే.. ఇప్పుడు కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో మంత్రి పొంగులేటి కుమారుడు ఇరుక్కోవ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది?

విదేశీ వాచీల‌పై యువ‌త‌కు స‌హ‌జంగానే మోజుంటుంది. ఈ క్ర‌మంలోనే పొంగులేటి కుమారుడు హ‌ర్ష కూడా విదేశీ వాచీల‌పై మోజు ప‌డ్డాడు. అయితే.. ఆయ‌న కావాల‌ని కోరుకున్న వాచీల‌పై భార‌త్‌లో నిషేధం ఉంది. అవి.. సింగపూర్ కు చెందిన‌ పటెక్‌ ఫిలిప్‌, బ్రిగెట్‌ బ్రాండ్‌లకు చెందిన రెండు లగ్జరీ వాచ్ లు. వీటి విలువ ఒక్కొక్క‌టి రూ.1.75 కోట్ల‌కు పైగానే ఉంటుంది. పోనీ.. కొందాములే అనుకున్నా.. ఇవి భార‌త్‌లోకి అనుమ‌తించ‌డం లేదు.

అయినా.. హ‌ర్ష మ‌న‌సు ప‌డిన నేప‌థ్యంలో ఏదో ఒక విధంగా వాటిని ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేశాడు. ఇదే ఇప్పుడు హ‌ర్ష మెడ‌కు ఉచ్చుగా మారింది. మ‌న‌సు ప‌డ్డ రెండు వాచీల‌ను భార‌త్‌కు తెప్పించుకునేం దుకు.. 'ముబిన్‌' అనే స్మ‌గ్ల‌ర్ డాన్‌ను పొంగులేటి కుమారుడు ఆశ్ర‌యించాడు అనేది ఆరోపణ . ఈ క్ర‌మంలో మ‌ధ్య వ‌ర్తిగా న‌వీన్‌కుమార్ అనే వ్య‌క్తి ఉన్నాడు. మొత్తానికి హ‌ర్ష మ‌నసు ప‌డ్డ‌.. ఆ రెండు వాచీలు కొనేశారు.. దొంగ దారిలో చెన్నై ఎయిర్ పోర్టుకు తెచ్చేశారు. అయితే.. ఇక్క‌డే చిక్కుబ‌డి పోయారు.

ఇటీవ‌ల కాలంలో ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని విమానాశ్ర‌యాలు, పోర్టుల‌ను జల్లెడ‌ప‌డుతున్న అధికారుల‌కు ఈ వాచీల వ్య‌వ‌హారం తెలిసింది. దీంతో క‌స్ట‌మ్స్ అధికారులు ఆ వాచీల‌తో పాటు దాదాపు 100 కోట్ల రూపాయ‌ల విలువైన మ‌రికొన్ని వాచీల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో మీడియేట‌ర్ న‌వీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయ‌న‌ను విచారించారు. ఇలా.. తీగ లాగితే.. అది ఖ‌మ్మంలోని పొంగులేటి ఇంట్లో క‌దిలింది. హ‌ర్ష గుట్టు బ‌య‌ట ప‌డింది. ఈ వాచ్‌ల కోసం మ‌నీలాండ‌రింగ్‌ రూపంలో హ‌ర్ష‌ డబ్బు చెల్లించినట్లు ఆరోపిస్తున్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కస్టమ్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. గ‌త నెల‌లోనే హర్షకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల‌ 4న విచారణకు రావాలని హ‌ర్ష‌ను ఆదేశించారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈ నెల 27 తర్వాత‌ విచారణకు హాజరవుతానని హర్ష స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.

+ కస్ట‌మ్స్ కేసే అయితే.. 4 రెట్లు జ‌రిమానాతో స‌రిపోతుంది.

+ మ‌నీ లాండ‌రింగ్ కేసైతే.. అన్ని విధాలా ఇబ్బందులు త‌ప్ప‌వు.