Begin typing your search above and press return to search.

లావు వైసీపీలోకి ...ఫేకేనా...!?

ఏపీ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో జంపింగ్స్ అన్నవి కామన్.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:03 AM GMT
లావు  వైసీపీలోకి ...ఫేకేనా...!?
X

ఏపీ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో జంపింగ్స్ అన్నవి కామన్. అయినా ఇపుడు ఒకసారి వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రావడం జరుగుతోంది. అలాగే ఒక పార్టీలో చేరిన వారం రోజుల వ్యవధిలో వేరే పార్టీలోకి వెళ్ళడం కూడా ఏపీలోనే జరిగింది.

మూడు నెలల క్రితం వైసీపీని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి ఇపుడు వైసీపీలో తిరిగి చేరారు. జగన్ ని సీఎం గా మళ్ళీ చేస్తామని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో వైసీపీని ఈ మధ్య వీడి వెళ్లిన వారులో చాలా మంది తిరిగి వస్తారని ప్రచారం కూడా సాగుతోంది.అనంతపురం జిల్లాకు చెందిన కాపు రామచంద్రారెడ్డి కూడా వైసీపీలోకి వస్తారని ప్రచారం సాగుతోంది.

అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఇపుడు చూస్తే నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తిరిగి వైసీపీలో చేరుతున్నారు అని వార్తలు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నాయి. దాంతో ఇది నిజమా అని అంతా వాకబు చేసుకునే పరిస్థితి.

మొత్తానికి రోజంతా సోషల్ మీడియాలో తెగ తిరిగిన ఈ వైరల్ న్యూస్ ఫేక్ అని ఎంపీ లావు తేల్చేశారు. తాను తిరిగి వైసీపీలో చేరడం లేదు అంటూ ఆయన ఖండించారు. తాను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తానని అందుకే వైసీపీలోకి తిరిగి వెళ్తున్నాను అని వచ్చిన వార్తలు అన్నీ తప్పు అని ఆయన చెప్పేశారు. అదే టైం లో సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాను అన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

తాను ఎవరి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయడం లేదు అని లావు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదంతా ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. తొందరలోనే లావు టీడీపీలో చేరుతారు అని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. లావుకు చంద్రబాబు బిగ్ టాస్క్ అప్పగించారు అని ప్రచారం లో ఉన్న మాట. అదెలా అంటే వైసీపీ నుంచి అసంతృప్తి నేతలను తీసుకుని రమ్మని. దాంతో అద్దంకిలో కొందరు వైసీపీ నేతలను ఆయన టీడీపీ వైపుగా నడిపారు అని అంటున్నారు.

అలాగే బీసీ ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తిని సైకిలెక్కించే ఏర్పాట్లలో ఉన్నారని ఆయనకు గురజాల టికెట్ ఇప్పించేలా బాబు వద్ద సిఫార్సు చేస్తునారు అని అంటున్నారు. ఇలా టీడీపీలో గుంటూరు జిల్లాలో లావు ఒక బిగ్ షాట్ గా మారుతున్న నేపధ్యం ఉంది. బాబు కూడా ఆయనను పూర్తిగా వినియోగించుకుని గెలవాలని చూస్తున్నారు. దాంతో లావు వైసీపీ వైపు వెళ్ళేది ఉండదని అంటున్నారు.