Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో జేబు దొంగ‌లు.. ఏం జ‌రిగిందంటే!

ఇక‌, త‌మ చేతికి దొరికిన దొంగ‌ను బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు.. పోలీసుల‌కు అప్ప‌గించారు.

By:  Tupaki Desk   |   5 April 2024 1:08 PM GMT
కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో జేబు దొంగ‌లు.. ఏం జ‌రిగిందంటే!
X

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించారు. అయితే.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో ఇద్ద‌రు జేబు దొంగ‌లు హ‌ల్చ‌ల్ చేశారు. కరీంనగర్‌ జిల్లా, ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం రైతులతో ముఖాముఖిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఇద్ద‌రు జేబు దొంగలు హల్ చల్ చేశారు. పలు మండలాల్లో ఆయన ఎండిన పంటలను పరిశీలిస్తుండగా ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ.10 వేలు కొట్టేశాడు. అయితే, దొంగను పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. దీంతో త‌న వెంట మ‌రొక‌డు ఉన్నాడ‌ని చెప్ప‌డంతో అత‌ని కోసం గాలించారు. కానీ, అప్ప‌టికే మ‌రో దొంగ జారుకున్నాడు. ఇక‌, త‌మ చేతికి దొరికిన దొంగ‌ను బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు.. పోలీసుల‌కు అప్ప‌గించారు.

రైతులు ధైర్యంగా ఉండాలి: కేసీఆర్‌

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించిన కేసీఆర్‌.. రైతులు ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తొలుత కేసీఆర్‌ ముగ్ధుంపూర్ మండ‌లంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ఆయనకు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యని చెప్పారు. మంచినీళ్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు మ‌హిళ‌ల‌కు కేసీఆర్‌కు వివ‌రించారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కాగా, చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో రైతులతో ముచ్చటించిన‌ అనంతరం వేములవాడ, సిరిసిల్ల నియోజక వర్గాల్లో ప‌ర్య‌టించారు. చొప్పదండి నియోజకవర్గం, రామడగు మండలం, వేదిర గ్రామంలో ఎండిన వరి కంకులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి అందజేసిన రైతులు.. త‌మ క‌ష్టాలు చెప్పుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్ధతతో.. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో పంట‌లు ఎండిపోయాయ‌ని కేసీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సందర్భంగా పొలాల కు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసీఆర్ ముందు సమస్యలు చెప్పుకొన్నారు. ``రైతులందరూ ధైర్యంగా ఉండండి. ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం కట్టియ్యాలని కొట్లాడుదాం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుదాం`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.