Begin typing your search above and press return to search.

జగన్ 2.0... మరోసారి హోరెత్తించబోతోన్న వైసీపీ ప్లాన్స్ ఇవే!

ఈ మేరకు షెడ్యూల్ తాజాగా విడుదలైంది. దీంతో... ఏపీలో వైసీపీ సౌండ్ మరింత హోరెత్తిపొయే ఆవకాశాలున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

By:  Tupaki Desk   |   25 April 2024 4:38 PM GMT
జగన్ 2.0... మరోసారి హోరెత్తించబోతోన్న వైసీపీ ప్లాన్స్ ఇవే!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసిపోవడంతో జగన్ మరోసారి గేరు మార్చారు! ఇందులో భాగంగా.. మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ తాజాగా విడుదలైంది. దీంతో... ఏపీలో వైసీపీ సౌండ్ మరింత హోరెత్తిపొయే ఆవకాశాలున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అవును... ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. "గడప గడపకు మన ప్రభుత్వం"తో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌... ఎన్నికల సమయం ఆసన్నమైన తర్వాత "సిద్ధం" అంటూ కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. "న భూతో న భవిష్యతి" అన్నట్లు సాగిన ఆ సభల ఉత్సాహం కంటిన్యూ చేస్తూ... "మేమంతా సిద్ధం" అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా... 22 రోజులు.. 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్‌ షోలు.. 6 ప్రత్యేక సమావేశాలు.. 16 బహిరంగ సభలు.. సీఎం జగన్‌ "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర సాగిందిలా. ఈ సమయంలో ఎండలు 40 డిగ్రీలకు పైగా కాస్తున్నా, భానుడి ప్రతాపాన్ని ఏపీ ప్రజానికం పరిగణలోకి తీసుకోలేదు! మండుటెండైనా, అర్ధరాత్రయినా జగన్ కోసం నిలబడిపోయారు!

ఈ సమయంలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించేవారు. తన ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ది గురించి వివరిస్తూ.. పేదల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. తన పాలనలో మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని అడుగుతూ నికార్సైన రాజకీయానికి తెరలేపారు. ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కూటమి ఎన్ని నెరవేర్చిందో ఆలోచించాలని ఓటర్లను కోరారు.

ఈ క్రమంలో... ఊహించని విధంగా దుండగులు గాయం చేసినా జగన్ ప్రచారాన్ని ఆపలేదు.. షెడ్యూల్ మార్చలేదు. అనుకున్న సమయానికి అనుకున్నట్లు.. చెప్పిన సమయానికి చెప్పినట్లుగా ప్రజలను కలుసుకున్నారు. ఈ సమయంలో గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్.. తాడేపల్లి తన సొంత నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో... శుక్ర, శని వారాల్లో మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఈ క్రమంలో... ఆ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం పూర్తవ్వగానే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మలివిడత ప్రచార కార్యక్రమానికి ముహూర్తం పెట్టేశారు జగన్. ఈ మేరకు మొదటి నాలుగు రోజుల షెడ్యూల్‌ ను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 నుంచి మొదలయ్యే ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

ఇందులో భాగంగా... ఏప్రిల్ 28 ఉదయం 10 గంటలకు తాడిపత్రి, మధ్యాహ్నం 12 గంటలకు వెంకటగిరి, మధాహ్నం 3 గంటలకు కందుకూరు నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లోనూ... ఏప్రిల్ 29 ఉదయం 10 గంటలకు చోడవరం, మధ్యాహ్నం 12 గంటలకు పి.గన్నవరం, మధాహ్నం 3 గంటలకు పొన్నూరు నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారు.

ఇదే క్రమంలో... ఏప్రిల్ 30 ఉదయం 10 గంటలకు కొండపి, మధ్యాహ్నం 12 గంటలకు మైదుకూరు, మధాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లోనూ... మే 1వ తేదీన ఉదయం 10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12 గంటలకు పాయకరావుపేట, మధాహ్నం 3 గంటలకు ఏలూరు నియోజకవర్గాల్లోని బహిరంగ సభల్లో పాల్గొని జగన్ ప్రసంగించనున్నారు.