Begin typing your search above and press return to search.

దిల్ రాజు ఎంపీ టిక్కెట్ కన్ ఫాం అయిపోయిందా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 7:41 AM GMT
దిల్  రాజు ఎంపీ టిక్కెట్  కన్  ఫాం  అయిపోయిందా?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆరెస్స్ కార్యకర్తలకు సూచనలు చేసింది.. లోక్ సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇదే సమయంలో గెలుపు ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దిల్ రాజు పేరు తెరపైకి వచ్చింది!

అవును... గత ఐదారునెలలుగా సినీ నిర్మాత డిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఆయన బీఆరెస్స్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ పోటీచేస్తారని.. తద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కథనాలొచ్చాయి. అయితే ఆయనకు అసెంబ్లీ కంటే లోక్ సభకు పోటీచేయడానికే ఆసక్తి ఉందనే కామెంట్లూ వినిపించాయి.

ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్న నేపథ్యంలో... మరోసారి దిల్ రాజు పేరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని ఒక ప్రచారం ఊపందుకుంది. ఇదే క్రమంలో... నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని అంటున్నారు.

వాస్తవానికి టీ.ఎఫ్.సీ.సీ. ఎన్నికల సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ ఎంట్రీపై తొలిసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. ఇందులో భాగంగా... "నేను ఏ పొలిటికల్ పార్టీ తరఫున నిలబడినా ఎంపీగా గెలుస్తా.. అయితే నా ప్రియారిటీ మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుంది" అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. దీంతో నాడు ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సమయలో వచ్చే ఏడాది ఏప్రిల్ లో అని చెబుతున్న లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అంటూ దిల్ రాజుకి సంబంధించిన ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి.

కాగా... మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి సైతం నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే అదేస్థానానికి దిల్ రాజు పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది!