Begin typing your search above and press return to search.

కేంద్రంలో వాళ్లే అధికారంలోకి రావాలంట... గోయల్ కు ఇచ్చిపడేసిన బొత్స!

తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   26 April 2024 12:40 PM GMT
కేంద్రంలో వాళ్లే అధికారంలోకి  రావాలంట... గోయల్  కు ఇచ్చిపడేసిన బొత్స!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో... ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగియడంతో అన్ని పార్టీలు పూర్తిగా ఎన్నికల ప్రచారాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా... కేంద్రమంత్రి పియూష్ గోయల్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొన్ని చురకలు అంటిస్తూనే.. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు.

ఇందులో భాగంగా... మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలని మొదలుపెట్టిన బొత్స... ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పియూష్‌ గోయాల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇందులో భాగంగా... కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని.. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. విద్యాశాఖపై వస్తున్న కథనాలను నిరూపించాలని సవాల్ విసిరారు.

ఇదే సమయంలో గతకొంతకాలంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలొస్తున్నాయని చెప్పిన బొత్స... కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా... ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నట్లు వెల్లడించారు.

అనంతరం పియూష్ గొయల్ మాటలు గురివింద తరహాలో ఉన్నాయన్నట్లుగా స్పందించిన బొత్స... 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారు.. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు అని సూటిగ ప్రస్నించారు. ఇదే క్రమంలో... రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతోపాటు.. అడ్డంకులు అన్నీ తొలగించి భూములు అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇదే సమయంలో రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూటమి నేతలు చెప్పుకుంటున్న తరుణంలో స్పందించిన బొత్సా... 2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో... మధ్యలో ఒక్క ఇంజినే పని చేసిందా.. మరో ఇంజిన్‌ రిపేర్‌ అయ్యిందా.. అంటూ 2014లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేశా చేశారు.

ఇదే క్రమంలో... కేంద్రంలో ఈసారైనా తమపై ఆధారపడే పార్టీ అధికారంలొకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పిన బొత్స... అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన ఇంకా కొన్ని ప్రయోజనాలు కోసం మాట్లాడవచ్చని.. అది తమ స్వార్థం అని అన్నారు. ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదని స్పష్టం చేశారు. అందువల్లే మనపై ఆధారపడే ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉండాలని బొత్స కోరుకున్నారు!!